Begin typing your search above and press return to search.

స్పైడర్ పై మేకర్స్ ప్లానింగ్ ఇదే

By:  Tupaki Desk   |   26 May 2017 4:56 AM GMT
స్పైడర్ పై మేకర్స్ ప్లానింగ్ ఇదే
X
మహేష్ బాబు కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతేడాది సమ్మర్ లో వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత రాబోయే మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలని.. యూట్యూబ్ నుంచి థియేట్రికల్ కలెక్షన్స్.. శాటిలైట్ రైట్స్ నుంచి టీఆర్పీ రేటింగ్స్ వరకూ.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేసే మూవీ రావాలని కోరుకుంటున్నారు.

ఇందుకు తగ్గట్లుగానే మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో సంతోషించారు కానీ.. జనవరి చివరలో వస్తుందని భావించిన సినిమా సమ్మర్ పూర్తయిపోయినా.. ఇంకా రిలీజ్ పై క్లారిటీ లేదు. జూన్ 23న విడుదల చేస్తామని స్వయంగా చెప్పిన దర్శకుడు.. తర్వాత మాట తప్పక తప్పలేదు. ఎప్పుడు స్పైడర్ ను చూస్తామా అని ఆత్రంగా ఉన్న ఫ్యాన్స్ కు.. ఇప్పుడు స్పైడర్ కు సంబంధించి యూనిట్ ప్లానింగ్ పై స్పెషల్ అప్ డేట్ ఇది. పైకి ఏమీ మాట్లాడకపోయినా.. రిలీజ్ వరకూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారట మురుగ అండ్ టీం.

ఈ నెల 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ఇస్తారని ఇప్పటికే చెప్పుకున్నాం. అలాగే ఆడియో లాంఛింగ్ డేట్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఆడియోను.. సెప్టెంబర్ 1న లాంఛ్ చేయనున్నారట. సెప్టెంబర్ 22న వరల్డ్ వైడ్ గా స్పైడర్ ను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు తగినట్లుగా మురుగదాస్ టీం ప్లాన్ చేసుకుంది. 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొంగుతున్న స్పైడర్ తో.. టాలీవుడ్ సూపర్ స్టార్ కోలీవుడ్ లోనూ పాతుకుపోతాడనే అంచనాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/