Begin typing your search above and press return to search.
హీరో ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో స్పై?
By: Tupaki Desk | 19 March 2020 10:00 PM ISTజేమ్స్ బాండ్ 007 .. సినిమా హిస్టరీలో చెరిగిపోని పేరు ఇది. చుట్టూ స్పైలు తిరుగుతుంటే మనిషికి ఇంకేం ప్రైవసీ ఉంటుంది? బెడ్ రూమ్ .. బాత్రూమ్.. స్టార్ హోటల్.. ఆన్ రోడ్.. ఎక్కడ తిరిగినా స్పై వెంటాడేస్తూ అసలు గుట్టు కనిపెట్టి శత్రువుకి లీక్ చేసేస్తుంటే ఎలాంటి ముప్పు ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. ఇలాంటి స్పై వేషాలు ఆన్ సెట్స్ లో ఎవరైనా వేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి.
అలాంటి వేషాలే వేస్తున్నాడట ఆ అసిస్టెంట్ డైరెక్టర్. పైగా సదరు అసిస్టెంట్ హీరో రికమండేషన్ తో వచ్చాడు. ఇంకేం ఉంది? అసలు దర్శకత్వ శాఖలో రహస్యాలన్నిటినీ అతగాడు హీరోకి మోసేస్తుండడంతో అదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిందట. దీంతో దర్శకత్వ శాఖలో స్పై.. జాగ్రత్తరా బాబూ! అంటూ మిగతా వాళ్లంతా అలెర్టయిపోతున్నారట. సదరు హీరోగారి తరపు నుంచి వచ్చిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సెట్లో కనపడగానే డైరెక్షన్ టీమ్ అంతా జాగ్రత్త పడిపోతున్నారట. దర్శకుడి పొరపాట్లు అనో.. లేక అసిస్టెంట్ల పొరపాటు అనో... పుట్టి ముంచినా ముంచేస్తాడు. ఇక్కడ విషయాల్లో వేటిని హీరో దగ్గరికి మోసేస్తాడోననే బెంగతో అంతా అలెర్టయిపోయారట.
అతగాడి స్పై యాక్టివిటీతో ఎవరి పనికీ ప్రైవసీ అనేది ఉండడం లేదు. ఇక రహస్యాలు మోసేసే స్పై తమ వెంటే ఉండడం వల్ల స్క్రిప్టు దగ్గర నుంచి ఇంకే విషయం లో అయినా ఎట్నుంచి ఏం మోసేస్తాడోనన్న సందేహం ఉండడంతో అందరూ అదోలా ప్రవర్తిస్తున్నారట. ఇక స్క్రిప్టు విషయంలో మార్పులు వగైరా ఏవైనా తనకు తెలియకుండా చేస్తే చెప్పాలి అంటూ.. ఇలా ఇండైరెక్ట్ గా తన అసిస్టెంట్ ని ఆ హీరోగారు డైరెక్షన్ టీమ్ లోకి స్పైలాగా దించడం బయటికి తెలిసి పోవడంతో ఇప్పుడు అక్కడ అంతా గజిబిజి గందరగోళంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇది ఏ సినిమా సెట్లో.. గెస్ యువర్సెల్ఫ్..