Begin typing your search above and press return to search.

కొరటాలపై భలే కామెడీలు చేస్తున్నారే

By:  Tupaki Desk   |   10 May 2018 7:00 AM IST
కొరటాలపై భలే కామెడీలు చేస్తున్నారే
X
తెలుగులో పొలిటికల్ యాంగిల్ లో సినిమాలు చాలా చాలా తక్కువగా వస్తాయి. అందుకే కాసింత ఆకట్టుకునే కంటెంట్ ఉంటే సినిమాలు తెగ ఆడేస్తుంటాయి. రంగం అంటూ వచ్చిన డబ్బింగ్ సినిమా.. అక్కడ కంటే ఇక్కడ తెగ ఆడేసింది కూడా ఆ కారణంతోనే అని చెప్పవచ్చు. గతేడాది నేనే రాజు నేనే మంత్రి చిత్రం కూడా రాజకీయ చిత్రంగా వచ్చి సక్సెస్ సాధించింది.

అయితే.. ఈ విజయాలతో పోల్చితే కలెక్షన్స్ రేంజ్ పరంగా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సక్సెస్ పెద్దది. దీంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు కొరటాల వెనక పడ్డాయంటూ.. కొన్ని మీడియా హౌస్ లు హంగామా చేస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం.. అధికార పీఠంపై కన్నేసిన ఓ బడా పార్టీ.. కొరటాలతో యాడ్స్ చేయించాలని చూస్తోందట. ఇందుకోసం భారీ మొత్తం ఆఫర్ చేసిందట కూడా. తమ ఎజెండాకు తగినట్లుగా క్రియేటివ్ కాన్సెప్టులు తనే రాసేసుకుని.. తెరకెక్కించేయాలని అడిగారని వాటి సారాంశం.

ఈ కథనాల కహానీ ఎలా ఉందంటే.. పొలిటికల్ యాంగిల్ లో సినిమాలు తీస్తే.. రాజకీయ నాయకులు వెంటబడితే.. మాఫియా సినిమాలు తీసిన వాళ్ల వెంట డాన్ లు పడతారు అన్నట్లుగా ఉది వీరి వాలకం. రాజకీయ ప్రకటనల కోసం క్రేజీ డైరెక్టర్లను వాడుకోవడం ఎప్పటినుంచో ఉంది. ఈ మాత్రం దానికి సినిమాలో చూపించిన పైపై సలహాలు చూసి పొలిటికల్ పార్టీలు ఇన్ స్పైర్ అయిపోయారంటే మాత్రం.. అది కచ్చితంగా కామెడీనే.