Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ పుకార్లే పుకార్లు
By: Tupaki Desk | 21 March 2021 11:47 AM ISTపవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపు మూడు ఏళ్లు గ్యాప్ తీసుకుని రాబోతున్న 'వకీల్ సాబ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ కు కమర్షియల్ టచ్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అభిమానులతో పాటు అన్ని వర్గాల వారిని కూడా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
గత వారం పది రోజులుగా వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకలో చిరంజీవి మరియు చరణ్ లతో పాటు ఇంకా మెగా ఫ్యామిలీ హీరోలు హాజరు అవ్వబోతున్నారని అలాగే ఈ వేడుక యూసుఫ్ గూడా పోలీస్ లైన్స్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ ఈవెంట్ కోసం ఏకంగా కోటి రూపాయలను నిర్మాత దిల్ రాజు ఖర్చు చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇప్పటి వరకు ఏ ఈవెంట్ కు కూడా ఇంత భారీగా ఖర్చు అవ్వలేదు. వకీల్ సాబ్ సినిమా కు మాత్రం కోటి ఖర్చు చేస్తున్నట్లుగా పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. మొత్తానికి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఉంటుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 9వ తారీకున వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనుక ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రీ రిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది. త్వరలో ఆ తేదీని ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.