Begin typing your search above and press return to search.

అలియా - ర‌ణ్ బీర్ ల పెళ్లి విందులో ఇవే స్పెష‌ల్‌

By:  Tupaki Desk   |   15 April 2022 10:00 PM IST
అలియా - ర‌ణ్ బీర్ ల పెళ్లి విందులో ఇవే స్పెష‌ల్‌
X
బాలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్ అలియా భ‌ట్ - ర‌ణ్ వీర్ క‌పూర్ ల వివాహం ఎత్త‌కేల‌కు ఏప్రిల్ 14న గురువారం రాత్రి బాంద్రాలోని ర‌ణ్ బీర్ క‌పూర్ ప్రాంగ‌ణంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. గ‌త ఐదేళ్లుగా ఎన్నాళ్లో వేచిన ఉద‌యం అంటూ ఎదురుచూస్తున్న వీరి పెళ్లికి ఆటంకాల‌న్నీ తొల‌గి ఫైన‌ల్ గా పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో బాలీవుడ్ కు చెందిన క్రేజీ స్టార్లంతా పాల్గొన్నారు. దీంతో ఫ్యాన్స్ మొత్తానికి ఊపిరి పీల్చుకున్నారు. త‌మ అభిమాన జంట ఐదేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత ఇప్ప‌టికైనా పెళ్లి బంధంతో ఒక్క‌టి కావ‌డంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు.

అలియా, ర‌ణ్ బీర్ ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. పెళ్లి వేడుక‌లో ప్ర‌తీ ఘ‌ట్టాన్ని ఎంజాయ్ చేసిన ర‌ణ్ బీర్ - అలియా పెళ్లిలో ఒక‌రికి ఒక‌రు మాల వేసుకున్న సంద‌ర్భంలో అంద‌రి ముందే లిప్ లాక్ కానిచ్చేసి షాకిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే ఈ పెళ్లిలో అలియాభ‌ట్ ఫాద‌ర్ మ‌హేష్ భ‌ట్ కూడా అలియా - ర‌ణ్ బీర్ ల పేర్ల‌తో మెహందీ పెట్టించుకుని మ‌రీ మ‌రిసిపోయిన తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

ఇదిలా వుంటే అలియా - ర‌ణ్ బీర్ ల పెళ్లి విందులో ఏర్పాటు చేసిన క‌శ్మీర్ స్పెష‌ల్ వంట‌కాలు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాయి. పెళ్లికి వ‌చ్చిన అతిథుల‌కు క‌శ్మీరీ వంట‌కాల‌ని ప్ర‌త్యేకంగా చేయించి వ‌డ్డించారు. ఈ వంట‌కాల్లో మూడు వంట‌కాలు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచాయ‌ని చెబుతున్నారు. ఇందులో మొద‌టిది క‌శ్మీర్ `మోదుర్ పులావ్‌`. దాల్చిన చెక్క‌, కొద్దిగా కుంకుమ పువ్వు, పాలు, నెయ్యి, పంచ‌దార‌, జీడిప్పులు, ప‌చ్చి ఏల‌కుల‌తో చేసిన తియ్య‌టి క‌శ్మ‌రీ రైస్ వంట‌కం. ఈ పులావ్ చాలా టేస్టీగా ప‌సందైన వాస‌న‌తో కూడి వుంటుంది. ఒక‌సారి తిన్నారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపించేలా ఈ వంట‌కం వుంటుంద‌ట‌.

రెండ‌వ‌ది ద‌మ్ ఒలావ్‌. క‌శ్మీరీ వంట‌కాల్లో అత్య‌ధిక భాగం నాన్ వెజిటేరియ‌న్ వంట‌కాలే. అయితే వెజిటేరియ‌న్ మాత్ర‌మే తినాల‌ని ఎదురుచూసేవారి కోసం బంగాళా దుంప‌ల‌తో ద‌మ్ ఒలావ్ లేదా ద‌మ్ ఆలూ ని చేస్తార‌ట‌. ఇది క‌శ్మీరీ వంట‌కాల్లో ప్ర‌సిద్ధి చెందిన వంట‌కాల్లో ఒక‌టిగా చెబుతున్నారు. ఈ వంట‌కం ప్ర‌త్యేక రుచి, వాస‌న రావ‌డానికి పెరుగు, అల్లం పొడి, సోపు.. వేడి మ‌సాలాల‌తో వండుతార‌ట‌. దీన్ని ఎక్కువ‌గా చ‌పాతీలో తీసుకుంటార‌ట‌.

ఇక మూడ‌వ‌ది `క‌హ్వా టీ`. ఇది జ‌మ్ము - క‌శ్మీర్ సంస్కృతిలో చాలా అత్యంత ఇష్ట‌ప‌డే పానియం అని చెబుతున్నారు. క‌హ్వా అనేది కుంకుమ పువ్వు సుగంధ ద్ర‌వ్యాలు, బాదం, వాల్ న‌ట్ ల‌తో త‌యారు ఒక మూలికా గ్రీన్ టీ లాంటిది. ఇందులో మొత్తం 20 ర‌కాలున్నాయ‌ట‌. దీన్ని మొగ‌ల్ ఛాయ్ అని కూడా పిలుస్తార‌ట‌. ఈ ప్ర‌త్యేక‌మైన వంట‌కాలు అలియా - రణ్ బీర్ ల పెళ్లిలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.