Begin typing your search above and press return to search.

వెంకీ మామ షాకింగ్ మేకోవ‌ర్.. వైర‌ల్ గా మారిన పిక్‌

By:  Tupaki Desk   |   13 Dec 2021 10:30 AM GMT
వెంకీ మామ షాకింగ్ మేకోవ‌ర్.. వైర‌ల్ గా మారిన పిక్‌
X
విక్ట‌రీ వెంక‌టేష్ ఈ ఏడాది వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఆయ‌న న‌టించిన రీమేక్ చిత్రాలు నార‌ప్ప‌ , దృశ్యం - 2 బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ వేదిగా విడుద‌లై అనూహ్య విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ఈ రెండు చిత్రాలిచ్చిన విజ‌యానందంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న విక్ట‌రీ వెంక‌టేష్ ఓ ప‌క్క `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3`లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ ని కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. `రానా నాయుడు` పేరు తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.

ఇదిలా వుంటే విక్టరీ వెంక‌టేష్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌ల వెల్లువెత్తుతున్నాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ , గ్లింప్స్ లతో మేక‌ర్స్ ఆయ‌న ఫ్యాన్స్ కి స్పెష‌ల్‌ ట్రీట్స్‌ ఇస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న `ఎఫ్ 3` చిత్రం నుంచి ఓ స్మాల్ గ్లింప్స్ ని చిత్ర బృందం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ఇదే సంద‌ర్భంగా విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న మొట్ట‌మొద‌టి వెబ్ సిరీస్ `రానా నాయుడు` నుంచి ఫ‌స్ట్ లుక్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేసింది. ఇందులో వెంకీ మామ షాకింగ్ మేకోవ‌ర్ తో ఓల్డ్ మ్యాన్ గా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ స్టిల్ నెట్టింట వైర‌ల్ గా మారింది. గ్రే హేయిర్ తో ఓల్డ్ మ్యాన్ గెట‌ప్ లో స‌రికొత్త మేకోవ‌ర్ లో క‌నిపిస్తున్న వెంక‌టేష్ స్టిల్ ని ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేసిన నెట్ ఫ్లిక్స్ ఆ ఫొటోకి ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని జ‌త చేసింది.

ఇంకీ ఏమొచ్చు? .. ఫ్రెండ్స్ తో వున్నా... ఫ్యామిలీతో వున్నా...ఒంట‌రిగా వున్నా వెంకీ మామ సినిమాలు ఎంజాయ్ చేయ‌డం వ‌చ్చు.. ఎనీ జాన‌ర్ .. ఎనీ ఎమోష‌న్‌.. సింగిల్ నేమ్` అంటూ ల‌వ్ సింబ‌ల్‌ ని నెట్ ఫ్లిక్స్ ఇండియా పోస్ట్ చేస్తే రానా దాన్ని లైక్ చేస్తున్నాన‌ని ` చెబుతూ ఎనీ జాన‌ర్ .. ఎనీ ఎమోష‌న్‌.. సింగిల్ నేమ్ వెంకీ` అని ట్వీట్ చేసి బాబాయ్ వెంక‌టేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. అమెరిక‌న్ వెబ్ సిరీస్ ఆధారంగా `రానా నాయుడు` సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.