Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య ఈవెంట్.. స్పెషల్ ట్రైన్!

By:  Tupaki Desk   |   14 Dec 2022 7:30 AM GMT
వాల్తేరు వీరయ్య ఈవెంట్.. స్పెషల్ ట్రైన్!
X
2024 జనవరి సంక్రాంతికి రాబోతున్న బిగ్ బడ్జెట్ సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ ఉండడం కూడా మాస్ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని దాటేసాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

ఇక సాంగ్స్ కూడా అందరిని ఎంతగానో కట్టుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా ప్రమోషన్స్ పెంచాలని చూస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంలో అభిమానుల్లో కూడా కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు మొత్తానికి ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలని అనుకుంటున్నారు.

సినిమా బ్యాక్ డ్రాప్ కూడా అదే కావడంతో అక్కడైతేనే బెటర్ అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. విశాఖలో ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రణాళికలు మొదలైనట్లుగా తెలుస్తోంది.

అయితే హైదరాబాదు నుంచి విశాఖకు ఫ్యాన్స్ రావడానికి ప్రత్యేకంగా ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా టాక్ వస్తోంది. విశాఖలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించే సినిమా స్థాయిని మరో లెవల్ కు పెంచాలని మైత్రి మూవీ మేకర్స్ అయితే గట్టిగానే ఒక ప్లాన్ వేసింది.

ఇక ఈ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చే హీరో ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాలు కథనాలు అయితే వెలువడుతున్నాయి. కానీ ఇంకా ఆ విషయంలో అయితే ఎలాంటి క్లారిటీ లేదు.

మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత కలిసిన నటించిన సినిమా కావున సంక్రాంతికి భారీ ఒపెనింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పోటీగా సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ సినిమా కూడా వస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.