Begin typing your search above and press return to search.

మెగా కోడలికి స్పెషల్ సర్ప్రైజ్.. సీమంతం ఫొటోస్ వైరల్

By:  Tupaki Desk   |   18 Feb 2023 7:25 PM IST
మెగా కోడలికి స్పెషల్ సర్ప్రైజ్.. సీమంతం ఫొటోస్ వైరల్
X
టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌ లిస్టులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసనలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి.

ఈ క్రమంలో త్వరలోనే తల్లిదండ్రులు కానున్న రామ్‌చరణ్‌ దంపతులకు చిన్న సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు ఉపాసన స్నేహితులు. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్న పాటి సీమంతం చేశారు.

ఈ సందర్భంగా ఉపాసన మెడలో పూలదండ వేసి పలు బహమతులు అందించారు. ఈ ఫొటోలను బేబీ కమింగ్‌ సూన్‌ అంటూ తన ఇన్‌ స్టా స్టోరీస్‌ లో షేర్‌ చేసుకుంది ఉపాసన. అలాగే ఉపాసన స్నేహితులు కూడా బేబీ షవర్‌ ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్ దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లి దండ్రులు అవుతున్నట్లు స్వయంగా చిరంజీవి ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో తెలిపారు. ఆ ఆంజనేయ స్వామి కృపతో త్వరలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు.

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఏమి చేసినా సెన్సేషనే. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన.

ఇటీవలే ఉపాసన చేసిన మరో పోస్ట్​ కూడా వైరల్​ అయింది. ప్రముఖ అధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్​, ఆయన కుమార్తె రాధ జగ్గీతో దిగిన ఫొటోను షేర్ చేశారు. దానికి కింద రాసిన క్యాప్షన్​ అందరినీ ఆకట్టుకుంది. అందులో "ఇద్దరు కుమార్తెలతో సద్గురు. ఒకరు సొంత కుమార్తె. మరొకరు దత్త పుత్రిక" అని రాసుకొచ్చారు. కాగా, ఉపాసన తాత, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్​ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు.. సద్గురు ఆయన కుమార్తె హాజరయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.