Begin typing your search above and press return to search.
స్పెషల్ స్టోరీ: నెం.1 ప్లేస్ లో టాలీవుడ్..!
By: Tupaki Desk | 15 April 2021 5:11 PM ISTభారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి కూడా బాలీవుడ్ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతూ వస్తోంది. సౌత్ ఇండస్త్రీలైన టాలీవుడ్ - కోలీవుడ్ లు దానితో పోటీపడినప్పటికీ, ప్రాంతీయ సినిమాలుగా చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటడమే కాకుండా ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని పొందుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు తీస్తూ టాలీవుడ్ సూపర్ ఫార్మ్ లో ఉంది. తెలుగు సినిమా అంటే ప్రాంతీయ మూవీ కాదని.. పాన్ ఇండియా మూవీ అనే స్థాయిలో సినిమాలు చేస్తున్నారు.
వాస్తవానికి 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో పాన్ ఇండియా మార్కెట్ కి తెలిసొచ్చిందని చెప్పవచ్చు. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండియాలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. అంతేకాకుండా సౌత్ మేకర్స్ అందరికి పాన్ ఇండియా సినిమాలు చేయొచ్చనే ధైర్యాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ హయ్యెస్ట్ బడ్జెట్ తో నేషనల్ వైడ్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ను నెం.1 ప్లేస్ లో నిలిపారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడి రెట్టింపు ఉత్సాహంతో విశ్వాసంతో వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చలాయిస్తోంది.
ఇకపోతే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న మాలీవుడ్ సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పవచ్చు. బడ్జెట్ ని కాకుండా కంటెంట్ ని నమ్ముకొని థ్రిల్లర్ మూవీస్ - ఇన్వెస్టిగేటివ్ డ్రామాలతో మలయాళ సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్న కోలీవుడ్ ఇప్పుడు మూడో ప్లేస్ కి వచ్చింది. ఇదే క్రమంలో కన్నడ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటోంది. 'కేజీఎఫ్' సినిమాతో శాండిల్ వుడ్ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ హవా తగ్గిస్తూ దక్షిణాది పరిశ్రమలు టాప్ లో ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' జులై 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలానే 'సలార్' 2022 ఏప్రిల్ లో.. 'ఆదిపురుష్' వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'కేజీఎఫ్ చాప్టర్ 2' జూలై 16న బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మేజర్' చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ జూలై 2న విడుదల చేయనున్నారు.
ఇక అల్లు అర్జున్ 'పుష్ప'.. చిరంజీవి 'ఆచార్య' సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్' చిత్రాన్ని సెప్టెంబర్ 9న వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ఐదు బాషల్లో రూపొందుతోంది. ఇలా టాలీవుడ్ సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాయి.