Begin typing your search above and press return to search.
'ఆచార్య' కు తెలంగాణా సర్కారు తీపి కబురు..!
By: Tupaki Desk | 25 April 2022 9:25 PM ISTమెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''ఆచార్య''. మెగా అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్న ఈ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని సినీ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణించి టికెట్ రేట్లు పెంచుకోడానికి అవకాశం కల్పిస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఆచార్య' మేకర్స్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ మేరకు అభ్యర్థించారు. దీనికి అనుమతి వచ్చిన తర్వాత బుకింగ్స్ తెరవాలని నిర్ణయించుకున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం 'ఆచార్య' సినిమాకు తీపి కబురు చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. నిర్మాతల రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుని.. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు.
జీవో ప్రకారం ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్ లో రూ.50.., సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 పెంచుకోడానికి అవకాశం కలిగింది. దీంతోపాటు వారం రోజుల పాటు ఐదో షో ప్రదర్శనకు కూడా అనుమతి కల్పించారు. తెలంగాణ సర్కారు జీవో ఇచ్చిన కాసేపటికే బుక్ మై షోలో 'ఆచార్య' సినిమా టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'ఆచార్య' టికెట్ రేట్లు పెంచుకోడానికి తెలంగాణలో అనుమతులు దొరకగా... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా టికెట్ ధరలపై అనుమతి లభించలేదని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు మూడు రోజులే సమయం ఉంది కనుక.. రేపు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, మెగా తండ్రీకొడుకులు చిరు - చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. చిరంజీవి కి జోడీగా హీరోయిన్ లేదు. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ కీలక పాత్రలు పోషించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనగర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు.