Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ గెస్ట్ ఎవరబ్బా??

By:  Tupaki Desk   |   14 Sept 2017 6:21 PM IST
ఎన్టీఆర్ గెస్ట్ ఎవరబ్బా??
X
ప్రస్తుత రోజుల్లో ఎక్కడైనా ఒక షో పెద్ద హిట్ అయ్యిందంటే చాలు ఆ షోని పరభాష ప్రేక్షకులకు కూడా చూపించడానికి రెడీ అయిపోతున్నారు షో నిర్వాహకులు. అదే తరహాలో బిగ్ బాస్ షో ఇప్పుడు ఇంటర్ నేషనల్ లెవెల్ లో హాల్ చల్ చేస్తోంది. మొన్నటి వరకు నార్త్ లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు సౌత్ జనాలను కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో అయితే బిగ్ బాస్ ఊహించిన దానికంటే ఎక్కువనే టిఆర్పి రేటింగ్స్ ను అందుకుంటోంది.

మొదట కాస్త నిరాశపరిచినా ఆ తర్వాత హౌస్ లో జరుగుతున్న పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనని ప్రేక్షకులు ఆసక్తి చూపడం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ షోని మరో స్థాయికి తీసుకెళ్లాడనే చెప్పాలి. అలాగే ఈ షో ద్వారా తారక్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా బాగా ఆకర్షించాడు. అయితే ఈ షోలో ఇప్పటివరకు వారి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రానా - విజయ్ దేవరకొండా -అల్లరి నరేష్ మరియు హీరోయిన్ తాప్సితో పాటు యాంకర్ సుమా కూడా వచ్చారు. అయితే బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంటుండడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ నెల 24న జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ ని అనౌన్స్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయబోతున్నారట షో నిర్వహాకులు.

అయితే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును రిక్వెస్ట్ చేయగా అందుకు అయన నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సారి వారిద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. సో ఎన్టీఆర్ కూడా అందుకు ఒప్పుకోలేదని వేరే స్టార్ ని చూడమని చెప్పాడని టాక్. మారి ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చే ఆ స్పెషల్ గేఫ్ట్ ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.