Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ది రష్మిక మీల్'

By:  Tupaki Desk   |   19 Nov 2021 8:35 AM GMT
ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా  ది రష్మిక మీల్
X
అందం .. అదృష్టం కలిసి పెట్టుకున్న పేరే రష్మిక. పడుచు మనసుల కోసం ఊహల ఉద్యానవనంగా మారిన ఊరే రష్మిక. చిలిపి చూపులతో .. కొంటె నవ్వులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటుంది. 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ తరువాత కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. ఫస్టు సినిమాతోనే హిట్ కొట్టేసిన రష్మిక, 'గీత గోవిందం' సినిమాతో స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోకి చేరిపోయింది. 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమా చేస్తోంది.

ఒక వైపున తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన దూకుడును కొనసాగిస్తూనే, మరో వైపున తమిళ .. హిందీ భాషల్లో కుదురుకునే పరయత్నాల్లో ఉంది. ఇక కన్నడలో ఎలాగూ ఆమెకి కావలసినంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ క్రేజ్ ను సౌత్ నుంచి నార్త్ వరకూ విస్తరించే పట్టుదలతో ఉంది. అందువల్లనే పాప్యులర్ ఫుడ్ సంస్థ మెక్ డోనాల్డ్స్ దృష్టి ఈ బ్యూటీ పై పడింది. రష్మిక క్రేజ్ ను తమ బిజినెస్ కు జోడిస్తూ తెలివిగా ఒక ప్లాన్ చేసింది. రష్మిక ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ ట్రీట్ ను అందించబోతోంది.

'ది రష్మిక మీల్' పేరుతో ప్రత్యేక మీల్ కేటగిరిని రూపొందించింది. రష్మిక ఇష్టపడే ఐటమ్స్ తో కూడిన మీల్ ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. 'ది రష్మిక మీల్' ప్యాకేజ్ లో మెక్ స్పైసీ .. ఫ్రైడ్ చికెన్ .. మెక్ స్పైసీ చికెన్ బర్గర్ .. పెరి పెరి ఫ్రైస్ .. నింబూ ఫిజ్ .. మెక్ ఫ్లర్రి ఉంటాయి. ఫుడ్ విషయంలో రష్మిక ఎక్కువగా ఏం ఇష్టపడుతుందో తెలుసుకోవాలనే అభిమానులకు ఇప్పుడు ఆ జాబితా ఏమిటో తెలిసిపోయింది. ఇక వాటి టేస్టు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చునన్నమాట.

'ది రష్మిక మీల్'ను ప్రారంభించిన మెక్ డొనాల్స్డ్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అరవింద్ ఆర్ పి మాట్లాడుతూ .. "సెలబ్రిటీలతో సహా ప్రతి ఒక్కరూ మెక్ డొనాల్స్డ్ లో తమ గో టూ ఆర్డర్ ను కలిగి ఉన్నారు. రష్మికతో కలిసి పనిచేస్తున్నందుకు .. ఆమె అభిమానులకు ఈ స్పెషల్ మీల్ ను అందిస్తున్నందుకి సంతోషంగా ఉంది" అన్నారు. ఇక రష్మిక మాట్లాడుతూ .. "జీవితంలో పెద్ద .. చిన్న సక్సెస్ లను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నా మెక్ డొనాల్డ్స్ ఫేవరేట్స్ ను అందరితో కలిసి పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.