Begin typing your search above and press return to search.

బంగార్రాజు బ్యూటీ వెయిటింగ్ ఫ‌లించిన‌ట్టే!

By:  Tupaki Desk   |   15 Nov 2021 5:36 AM GMT
బంగార్రాజు బ్యూటీ వెయిటింగ్ ఫ‌లించిన‌ట్టే!
X
దిల్లీ బ్యూటీ ద‌క్ష న‌గ‌ర్ క‌ర్ టాలీవుడ్ కి సుప‌రిచితురాలే. `హుషారు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తొలి సినిమానే స‌క్సెస్ అందుకుని యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అటుపై `జాంబీరెడ్డి` తో సెకెండ్ స‌క్సెస్ ని ఖాతాలా వేసుకుంది. ఇలా కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాల్ని సొంతం చేసుకుని యువ‌తలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ప్ర‌స్తుతం నాగార్జున‌-నాగ‌చైత‌న్య న‌టిస్తున్న `బంగార్రాజు`లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇస్తోంది. నాగ‌చైత‌న్య‌-నాగార్జున‌ల‌తో క‌లిసి ఓ పాట‌లో క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతం మైసూర్ లో ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

ద‌క్ష స‌హా అంతా షూట్ లో పాల్గొంటున్నారు. ఈ పాట సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గా నిలుస్తుంద‌ని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీక్ష హాట్ లుక్స్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందేన‌ని యూత్ కామెంట్లు పెడుతున్నారు. బంగార్రాజు రిలీజ్ కి ముందే ఇలా ద‌క్ష‌ పేరు ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే ద‌క్ష న‌గ‌ర్ క‌ర్ ఓ బిగ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఓ అగ్ర హీరో చిత్రంలో మెయిన్ లీడ్ గానే ఎంపికైంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంతో తేలాల్సి ఉంది. అదే గ‌నుక నిజమైతే ద‌క్ష కెరీర్ పెద్ద మ‌లుపు తీసుకున్న‌ట్లే.

ఇటీవలి కాలంలో కొత్త భామ‌లు క్లిక్ అవ్వ‌డం అనేది గ‌గ‌న‌మైపోయింది. సీనియ‌ర్ల‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. న‌వ‌తరం నాయిక‌ల్ని ప్రోత్స‌హించ‌లేద‌న్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ద‌క్ష లాంటి భామ‌లు ఆ రూమ‌ర్లకు బ్రేక్ వేసిన‌ట్లే అవుతుంది.

ఇక సోష‌ల్ మీడియాలో ద‌క్ష స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ ఫోటోల‌తో ఇన్ స్టాని హీటెక్కించ‌డం అమ్మ‌డిలో మ‌రో స్పెషాలిటీ. ద‌క్ష లాంగ్ వెయిటింగ్ ఫ‌లించి ఇక‌నైనా పెద్ద‌గా ఎదిగేస్తుందేమో చూడాలి.