Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్ ఫోటోతో 'స్పెషల్ అట్రాక్షన్'గా కుర్రహీరోయిన్స్..!

By:  Tupaki Desk   |   5 April 2021 10:00 PM IST
త్రోబ్యాక్ ఫోటోతో స్పెషల్ అట్రాక్షన్గా కుర్రహీరోయిన్స్..!
X
ఈ మధ్యకాలంలో సినీ హీరోయిన్స్ త్రోబ్యాక్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం మాములే అయిపోయింది. ఎలాంటి స్పెషల్ డే వచ్చినా వెంటనే తమ త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు కుర్రహీరోయిన్స్ ఒకే ఫోటోలో కనిపించి పిక్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఆ హీరోయిన్స్ ఎవరో కాదు.. మహానటి కీర్తిసురేష్, హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్. ఈ ఇద్దరూ కలిసిన దిగిన చిన్ననాటి క్యూట్ ఫోటోను షేర్ చేసింది కీర్తి. ఎందుకంటే ఈరోజు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫోటోను పోస్ట్ చేసింది. ఫోటోలో కళ్యాణి కుర్చీలో కూర్చొని ఉండగా.. పక్కనే నిలబడి కీర్తి కనిపించింది.

ఆ ఫోటో చూస్తూ ఇటు కళ్యాణి ఫ్యాన్స్ అటు కీర్తి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. అయితే ఇద్దరూ కూడా ప్రస్తుతం హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ఈ విషయంలో కీర్తి హీరోయిన్ గా చాలా సక్సెస్ అయింది. కానీ ఇంతవరకు కళ్యాణి ఏ ఇండస్ట్రీలో కూడా సెట్ అవ్వలేకపోయింది. అయితే కీర్తి - కళ్యాణి చిన్నప్పటి నుండే మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే కళ్యాణి తండ్రి టాప్ దర్శకుడు. ఇటు కీర్తి తండ్రి సినీనిర్మాత. ఇంకా వీరిద్దరి మామ్స్ కూడా అప్పట్లో హీరోయిన్స్. అందుకే పూర్తిగా వీరిద్దరూ సినిమా వాతావరణంలోనే పెరిగారు. కళ్యాణి కంటే కీర్తి పెద్దదే అయినప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే ఈరోజు కీర్తి చైల్డ్ హుడ్ పిక్ షేర్ చేసి కళ్యాణి పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పరంగా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కళ్యాణి - కీర్తి ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.