Begin typing your search above and press return to search.

నెల్లూరు ప్ర‌భుత్వ స్కూల్ కి ఎస్.పి. బాలు పేరు..భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్!

By:  Tupaki Desk   |   27 Nov 2020 10:15 AM IST
నెల్లూరు ప్ర‌భుత్వ స్కూల్ కి ఎస్.పి. బాలు పేరు..భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్!
X
గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆక‌స్మిక మ‌ర‌ణం అభిమానుల్ని క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారీ ఆయ‌న‌ను బ‌లిగొంది. ఈ మరణం సంగీత పరిశ్రమలో శూన్యతను సృష్టించింది. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం అభిమానులు ర‌క‌ర‌కాలుగా నివాళులు అర్పిస్తున్నారు.

ఇందులో ఎక్కువ మంది గాన‌గంధ‌ర్వుడి సేవ‌ల్ని గుర్తించి కేంద్ర‌ ప్ర‌భుత్వం భార‌త‌ర‌త్న‌ను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కాదు.. క్లాసిక్ గాయకుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పగా నివాళులు అర్పించే ప్లాన్ చేస్తోంద‌ని తాజాగా రివీలైంది. నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలను డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ గా పేరు మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. యాధృచ్ఛికంగానే అయినా ఎస్పీబి నెల్లూరులో పుట్టి పెరిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్పీబీ నెల్లూరులోని తన పూర్వీకుల ఇంటిని కంచి మఠానికి విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు ఎస్పీబీకి అరుదైన గౌర‌వం ల‌భించ‌నుంది.

నెల్లూరులోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు ఎస్పీబీ పేరు పెడుతున్నామ‌ని ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌‌ మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ఎస్పీబీకి చేయాల్సిన‌వ‌న్నీ చేస్తుండ‌డం ప్ర‌శంస‌నీయం. ఎస్పీబీ అంత్య‌క్రియ‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఎంతో గౌర‌వం క‌ల్పించింది. రాష్ట్రం నుండి ప్రతినిధుల్ని చెన్న‌య్ కి పంపారు. ఇక‌పై ఏపీలో సంగీతం గానంకి అత్యంత ప్రాధాన్య‌త పెంచే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది అంటే బాలు గారికి గౌర‌వం ఇవ్వాల‌నే ఉద్ధేశ‌మేన‌ని తెలుస్తోంది.