Begin typing your search above and press return to search.

మెహరీన్ పక్కన ఈ కొత్త కుర్రాడు ఎవ‌ర‌బ్బా?

By:  Tupaki Desk   |   8 May 2022 6:30 AM GMT
మెహరీన్ పక్కన ఈ  కొత్త కుర్రాడు ఎవ‌ర‌బ్బా?
X
ఔత్సాహికుల్ని టాలీవుడ్ ఎప్పుడూ ప్రోత్స‌హిస్తుంది. ట్యాలెంటెడ్ న‌టుల్ని ఎంకరేజ్ చేయ‌డంలో ప‌రిశ్ర‌మ ప్రోత్స‌హంలో క‌రువులేదు. ఎంతో మంది యంగ్ స్టార్స్ టాలీవుడ్ లో హీరోలుగా ఎదిగారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి సూప‌ర్ స్టార్స్ గా రూపం మార్చు కుంటున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని...విజ‌య్ దేవ‌ర‌కొండ‌..కార్తికేయ‌..కిర‌ణ్ అబ్బ‌వ‌రం లాంటి వాళ్ల‌కి లెఆంటి బ్యాక‌ప్ లేదు. కానీ నేడు ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కంటూ ఓ గుర్తింపును ద‌క్కించుకున్నారు. బిజీ స్టార్ల‌గా కొన‌సాగుతున్నారు. వీళ్లంతా స‌క్సెస్ అయిన హీరోలు.. స‌క్సెస్ కాకుండా ఫెయిలై ఇంటి దారి ప‌ట్టిన జాబితా కూడా ఉంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

తాజాగా మ‌రో యంగ్ హీరో లాంచ్ అయ్యాడు. విక్రాంత్ అనే కొత్త కుర్రాడు హీరోగా `స్పార్క్ `అనే సినిమా ప్రారంభ‌మైంది. ఇందులో మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాని స్టైలిష్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి అతిధిగా విచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్..సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు..పారిశ్రామిక వేత్త రామ‌రాజు..రంజిత్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇలా అతిర‌ధ మ‌హార‌ధుల స‌మ‌క్షంలో ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ చిత్రానికి అర‌వింద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌లు వహిస్తున్నారు. అర‌వింద్ ర‌త్న‌వేలు..శంక‌ర్.. సుకుమార్ వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసారు. 400 యాడ్స్ కి ప‌నిచేసాడు. డెప్ ప్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మొద‌టి షెడ్యూల్ హైద‌రాబాద్ లో మొద‌లపెడుతున్నారు. త‌దుప‌రి కొన్ని క్రేజీ లోకేష‌న్స్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ ..డార్జిలింగ్.. ముంబై..గోవాల‌తో పాటు ఫారిన్ లోనూ షూటింగ్ చేయ‌నున్నారు.

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. ఈ జాన‌ర్ లో కొత్త‌గా ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. యంగ్ హీరో విష‌యానికి వ‌స్తే విక్రాంత్ స‌క్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్. సినిమాల‌పై ప్యాష‌న్ ఉన్న న‌టుడు. ఇప్పుడా ఫ్యాష‌న్ నిరూపించుకోవ‌డానికి రంగుల ప్ర‌పంచ‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. సినిమా నిర్మాణంపైనా మంచి ప్రణాళిక‌లు క‌ల్గిన వ్య‌క్తి అని స‌మాచారం. ఇటీవ‌లి కాలంలో మెహ‌రీన్ కి అవ‌కాశాలు అంత‌గా లేవు. దీంతో మెహ‌రీన్ హీరోయిన్ గా ఎంపిక చేసాడు. ఛాన్సు లు లేని మెహ‌రీన్ కి ఓ అవ‌కాశం క‌ల్పించాడు.

ఫోటో సెష‌న్ లో భాగంగా యంగ్ హీరో ప‌క్క‌నే మెహ‌రీన్ త‌ళుక్కున మెరిసింది . ఇద్ద‌రు జంట‌గా కెమెరాకి ఫోజులిచ్చారు. అందులో ఓ ఫోటో లో మెహ‌రీన్ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. ఎరుపు రంగు డిజైన‌ర్ గౌనులో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. స్లిమ్ గా ఉంది. మ్యాక‌ప్...పాల సౌంద‌ర్యం స్కిన్ టోన్ లో మెహ‌రీన్ అందం మైమ‌రిపిస్తుంది. ఇక విక్రాంత్ క్యాజువ‌ల్ ప్యాంట్...వైట్ ష‌ర్ట్ లో కనిపిస్తున్నాడు.