Begin typing your search above and press return to search.

ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆవేదన

By:  Tupaki Desk   |   28 Jan 2019 9:06 AM GMT
ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆవేదన
X
తిరుపతిలో జరిగిన హరికథ వైభవోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్న గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నేటి సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు ఎలాంటి మాద్యమం లేని సమయంలో హరికథతో కళాకారులు ప్రజలను చైతన్య పర్చారు. కాని కాలక్రమేనా హరికథ మరియు హరికథ కళాకారులు అంతరించుకు పోతున్నారంటూ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆందోళ వ్యక్తం చేశాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో జానపదానికి చోటు కల్పించడం హర్షించదగ్గ విషయం. వచ్చే సారి హరికథకు కూడా పద్మ అవార్డును ఇవ్వాలని ఎస్పీ బాలసుబ్రమణ్యం కోరారు.

హరికథ వంటి కళను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్పీబీ సూచించారు. నేటి సమాజంలో స్త్రీ అశ్లీలత, ఎక్స్‌ పోజింగ్‌ మన సాంప్రదాయమా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో సావిత్రి వంటి వారు కట్టు బొట్టుతో ప్రేక్షకులను అలరించారు. కాని ఇప్పుడు మాత్రం హీరోయిన్స్‌ అర్థనగ్నంగా సినిమాల్లో నటిస్తున్నారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు పాటించేవి, కాని ఇప్పుడు సంస్కృతి, సాంప్రదాయాలు మన వారే పాటించడం లేదు. ప్రపంచంలోని అన్ని భాషల వారికి వారి భాషపై మక్కువ ఉంటుంది. కాని తెలుగు వారికి మాత్రం తెలుగు భాషపై మక్కువ లేదన్నాడు.

తిరుపతిలో ఉన్న ఎంఎస్‌ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని పట్టించుకునే వారే లేరు. ఒక వేళ తాను తిరుపతిలో పుట్టిన వాడినైతే ఆమె విగ్రహాన్ని ప్రతి రోజు శుభ్రపర్చి పూల దండలు వేసి పూజలు చేసే వాడినన్నారు. తన తండ్రి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన హరికథ వైభవోత్సవాలకు ప్రతి ఏటా ఒక లక్ష రూపాయలను ఇస్తానంటూ ఎస్పీబి ప్రకటించారు. ప్రభుత్వాలు పట్టించుకోకుంటే హరికథతో పాటు ఇంకా ఎన్నో కళలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఎస్పీ బాలు హెచ్చరించారు.