Begin typing your search above and press return to search.

నాగ్ పాట పాడుతూ బాలు కన్నీళ్లు

By:  Tupaki Desk   |   27 Sept 2016 10:46 AM IST
నాగ్ పాట పాడుతూ బాలు కన్నీళ్లు
X
తెలుగు సినిమాలో రెండు మూడు దశాబ్దాల పాటు ప్రధానంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిసే వినిపించింది. ఒక దశలో ‘నేపథ్య గానం’ అనే క్రెడిట్ కింద బాలు తప్ప మరో సింగర్ పేరే కనిపించేది కాదు. ఒక్కడే అన్ని పాటల్నీ అద్భుతంగా పాడేవాడు బాలు. ఇలా సుదీర్ఘ కాలం పాటలు పాడి పాడి అలసిపోయిన గాన గంధర్వుడు.. గత కొన్నేళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందులోనూ గత రెండు మూడేళ్లలో బాలు పాటలు బాగా తగ్గించేశారు. ఏదైనా సినిమాలో ఆయన పాడితే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో తాను మాత్రమే పాడగలిగే సినిమా ఒకటి వచ్చింది బాలుకి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ కోసం బాలును పిలిపించాడు ఎం.ఎం.కీరవాణి. ఇలాంటి సినిమాలకు ఆయనకు మించిన ఛాయిస్ ఇంకెవరుంటారు మరి.

ఐతే ఈ సినిమా కోసం బాలు భక్తిరస పాట ఒకటి పాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారట. ముందు ఈ పాటను డమ్మీ సింగర్ తో పాడించిన కీరవాణి.. ట్రాక్ రాఘవేంద్రుడికి ఇచ్చాడట. దాంతోనే రాఘవేంద్రరావు ఆ పాటను చాలా హృద్యంగా.. భావోద్వేగభరితంగా తెరకెక్కించారట. ఆ తర్వాత బాలుకు ఆ విజువల్స్ చూపించి.. పాడమని చెప్పారట. ఈ సందర్భంగా రాఘవేంద్రుడు ఆ పాటను చిత్రీకరించిన తీరు చూసి ఉద్వేగానికి లోనయ్యారట బాలు. పాట పాడుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన దర్శకేంద్రుడు.. మరోసారి అన్నమయ్య.. శ్రీరామదాసు మ్యాజిక్ రిపీట్ చేస్తున్నట్లే అన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/