Begin typing your search above and press return to search.

బాలుకు అందిస్తున్న ఎక్మో ట్రీట్‌మెంట్‌ అంటే ఏంటంటే..!

By:  Tupaki Desk   |   25 Sept 2020 12:45 PM IST
బాలుకు అందిస్తున్న ఎక్మో ట్రీట్‌మెంట్‌ అంటే ఏంటంటే..!
X
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాను జయించి కోలుకుంటున్నారని అంతా ఆనందంగా ఆయన డిశ్చార్జ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో అనూహ్యంగా నిన్న సాయంత్రం ఆసుపత్రి వర్గాల వారు ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేయడం జరిగింది. బాలు గారి ఆరోగ్యం గడచిన 24 గంటలుగా ఏమాత్రం సరిగా లేదని ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో ఎక్మో తో బాలుకి లైఫ్‌ సపోర్ట్‌ ఇస్తున్నామని బులిటెన్‌ లో వైధ్యులు పేర్కొన్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చివరి రోజుల్లో ఎక్మో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్లుగా అపోలో వర్గాల వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అతే తీరున బాలు గారికి ఎక్మో ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. శరీరంలోని గుండె.. ఊపిరి తిత్తులు ఇతర అవయవాలు పని చేయని సమయంలో ఎక్మో లైఫ్‌ సపోర్ట్‌ ఇస్తారు. ఎక్మో పరికరం అనేది మనిషి శరీరంలో గుండె మరియు ఊపిరితిత్తులు చేసే పనిని చేస్తుంది. ఆ అవయవాలు పని చేసేంత వరకు ఎక్మో పరికరంతో లైఫ్‌ సపోర్ట్‌ ఇస్తారు. అంటే మనిషి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన సమయంలో ఈ పరికరంను ఉపయోగిస్తారు. తిరిగి గుండె.. ఊపిరితిత్తులు పని చేసే సమయంలో ఎక్మోను తొలగిస్తారు. బాలు గారికి లైఫ్‌ సపోర్ట్‌ ఇస్తున్న కారణంగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ల ఆయన ఆరోగ్యం కుదుట పడాలంటూ కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నారు.