Begin typing your search above and press return to search.

నేను కోలుకున్నా.. బాలు గారి గురించే ఆందోళన

By:  Tupaki Desk   |   19 Aug 2020 4:40 PM IST
నేను కోలుకున్నా.. బాలు గారి గురించే ఆందోళన
X
లెజెండ్రీ సింగర్‌ ఎస్పీ బాల సుబ్రమణ్యం కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌ గా ఉంది. ఈ సమయంలో ఆయన కోసం ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం విషయంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ కాల్స్‌ చేస్తున్నారు. నా ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. నాకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన మాట నిజమే. అయితే కొన్ని రోజుల్లోనే నాకు బాగయ్యిందని సునీత పేర్కొంది.

తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని చిన్న తలనొప్పికే కరోనా పరీక్ష చేయించుకున్నాను. అనుమానం నిజం అయ్యి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. వెంటనే జాగ్రత్తగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. కొన్ని రోజుల్లోనే నెగటివ్‌ అయ్యింది. ప్రస్తుతం నా ఆరోగ్యం పూర్తిగా బాగయ్యింది. కాని ప్రస్తుతం నా ఆందోళన అంతా కూడా బాలు గారి గురించే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సునీత తన వీడియోలో పేర్కొంది. బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయంలో ఆమెతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన త్వరలో క్యూర్‌ అయ్యి బయటకు రావాలని మనమూ కోరుకుందాం.