Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజులలో ఎక్కువ వ్యూయర్ షిప్ తెచ్చుకున్న సౌత్ సినిమాలు..!

By:  Tupaki Desk   |   28 Dec 2020 4:30 PM GMT
ఓటీటీ రిలీజులలో ఎక్కువ వ్యూయర్ షిప్ తెచ్చుకున్న సౌత్ సినిమాలు..!
X
2020 సంవత్సరం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి బాగా కలిసొచ్చింది. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా థియేటర్స్ క్లోజ్ అవడంతో వినోదం కోసం జనాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయించారు. వీక్షకులు ఇందులో వచ్చే వెబ్ సిరీస్ లను ఒరిజినల్ మూవీస్ ని చూడటం అలవాటు చేసుకున్నారు. అలానే షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలను మేకర్స్ ఓటీటీ - ఏటీటీ వేదికలలో విడుదల చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో దక్షిణాది నుంచి సూర్య - నాని - అనుష్క - కీర్తి సురేష్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు మంచి టాక్ రన్ అవ్వగా.. మరికొన్ని నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నాయి. అయితే ఈ ఏడాది ఓటీటీలో విడుదలైన సౌత్ సినిమాలలో సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఎక్కువ మంది వీక్షకులు చూసిన సినిమాగా నిలిచినట్లు తెలుస్తోంది.

సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా తెలుగు తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య - అపర్ణ బాలమురళి ల నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన 'వి' సినిమా ఎక్కువ వ్యూయర్ షిప్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ ఆడియన్స్ ఈ సినిమాని బాగానే ఆదరించినట్లు తెలుస్తోంది.