Begin typing your search above and press return to search.

టాప్‌ 5 : సౌత్ సినిమాల టీజర్స్‌ రికార్డ్‌

By:  Tupaki Desk   |   25 May 2021 7:30 AM GMT
టాప్‌ 5 : సౌత్ సినిమాల టీజర్స్‌ రికార్డ్‌
X
ఒకప్పుడు సినిమా రికార్డులు అంటే ఎన్ని సెంటర్లలో 100 రోజులు 175 రోజులు ఆడింది చూసేవారు.. అలాగే వసూళ్ల పరంగా కూడా ఏ సినిమా ఎక్కువ వసూళ్లు చేసింది అనేది చూసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. పూర్తిగా సోషల్‌ మీడియా హడావుడి కనిపిస్తుంది. షూటింగ్‌ మొదలు పెట్టినప్పటి నుండి విడుదల అయ్యే వరకు ఎన్నో రికార్డులను అభిమానులు లెక్కిస్తూ ఉన్నారు. షూటింగ్‌ ప్రారంభించిన ఫొటోలు వీడియోలను లేదా ఫస్ట్‌ లుక్ ను విడుదల చేస్తే వాటికి సోషల్‌ మీడియా రీచ్ ను ప్రకటిస్తూ రికార్డు అంటూ ఉన్నారు. ఇక టీజర్ మరియు ట్రైలర్‌ ఇంకా పాటల యూట్యూబ్‌ వ్యూస్‌ రికార్డులను ఇప్పుడు నమోదు చేసుకుంటూ ఉన్నారు. మన సౌత్ సినిమాల్లో తక్కువ సమయంలో పాతిక మిలియన్‌ ల వ్యూస్ దక్కించుకున్న టీజర్ లను ఇప్పుడు చూద్దాం.

రెండు మూడు సంవత్సరాల ముందు వరకు యూట్యూబ్‌ లో మిలియన్ రెండు మిలియన్ ల వ్యూస్ అంటే అదో పెద్ద రికార్డు. అలాంటిది ఇప్పుడు వందల మిలియన్ ల వ్యూస్‌ ను అలవోకగా సాధిస్తున్నారు. అలా టీజర్ లతో పాతిక మిలియన్‌ ల వ్యూస్ ను తక్కువ సమయంలో దక్కించుకున్న సినిమాల్లో మొదటగా కేజీఎఫ్‌ 2 నిలిచింది. కన్నడ మూవీ అయిన కేజీఎఫ్‌ 2 కేవలం 15 గంటల్లో పాతిక మిలయన్ ల వ్యూస్‌ ను దక్కించుకుని నెం.1 గా నిలిచింది. రెండవ స్థానంలో అల్లు అర్జున్‌ సుకుమార్ ల పుష్ప సినిమా టీజర్‌ 26 గంటల్లో పాతిక మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకుంది.

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన మాస్టర్ టీజర్‌ పాతిక మిలియన్ ల వ్యూస్‌ ను కేవలం 48 గంటల్లో దక్కించుకుంది. ఇక బాలయ్య బోయపాటిల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా టీజర్‌ పాతిక మిలియన్ ల వ్యూస్ ను 5 రోజుల 19 గంటల్లో దక్కించుకుంది. ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా నుండి వచ్చిన ఎన్టీఆర్‌ ఇంట్రో వీడియో 6 రోజుల 12 గంటల్లో పాతిక మిలియన్ ల వ్యూస్ ను పొందింది. ఈ రికార్డులు వచ్చే ఏడాదికి తారు మారు అయ్యే అవకాశం ఉంది.