Begin typing your search above and press return to search.

సౌత్ ఇండియాలో వంద కోట్ల సినిమాలివే

By:  Tupaki Desk   |   23 Feb 2016 5:30 PM GMT
సౌత్ ఇండియాలో వంద కోట్ల సినిమాలివే
X
సౌత్ ఇండియన్ సినిమా అంటే ఏంటో గత కొన్నేళ్లలో అందరికీ తెలిసొచ్చింది. ఇంతకుముందు మన సినిమాలు బాలీవుడ్డోళ్లు తేలిగ్గా తీసుకునేవారు కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశమంతా మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాలకు దీటుగా తెలుగు - తమిళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వంద కోట్ల గ్రాస్ వసూళ్లు అన్నవి బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అని విర్రవీగేవారు కానీ.. వాటి కంటే సునాయాసంగా ఆ మార్కును అందుకుంటున్నాయి సౌత్ సినిమాలు. గత ఐదేళ్లలో 18 సౌత్ ఇండియన్ సినిమాలు రూ.100 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఆ సినిమాలేవో.. వాటి కలెక్షన్లు ఎంతో ఓ లుక్ వేయండి.

1. బాహుబలి- రూ.586 కోట్లు (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
2. రోబో- రూ.289 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
3. ఐ- రూ.239 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
4. శివాజీ- రూ.155 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
5. లింగా- రూ.154 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
6. మగధీర- రూ.150 కోట్లు (తెలుగ, తమిళం, మలయాళం)
7. శ్రీమంతుడు- రూ.144.55 కోట్లు (తెలుగు, తమిళం)
8. అత్తారింటికి దారేది- రూ.131 కోట్లు (తెలుగు మాత్రమే)
9. వేదాలం- రూ.126 కోట్లు (తమిళం మాత్రమే)
10. తుపాకి- రూ.125 కోట్లు (తమిళం, తెలుగు)
11. కత్తి- రూ.125 కోట్లు
12. సింగం 2- రూ.122 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
13. కాంఛన 2- రూ.113 కోట్లు (తమిళం, తెలుగు)
14. విశ్వరూపం- రూ.108 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
15. గబ్బర్ సింగ్- రూ.104 కోట్లు (తెలుగు మాత్రమే)
16. రేసుగుర్రం- రూ.102 కోట్లు (తెలుగు, మలయాళం)
17. పులి (విజయ్)- 101.9 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
18. దూకుడు- రూ.100 కోట్లు (తెలుగు, తమిళం, మలయాళం)