Begin typing your search above and press return to search.

సౌత్ సినిమాలే బాలీవుడ్ కి హోం వర్క్ !

By:  Tupaki Desk   |   17 March 2017 5:30 PM GMT
సౌత్ సినిమాలే బాలీవుడ్ కి హోం వర్క్ !
X
చాలామంది నార్త్ భామలు.. తమ కెరీర్ తొలినాళ్లలో దక్షిణాది సినిమాలు చేస్తుంటారు. ఆ తర్వాత కాసింత క్రేజ్ రాగానే బాలీవుడ్ నావ ఎక్కేసి తమ ప్రయాణం సాగిస్తుంటారు. ఇక్కడ పని చేయడం కారణంగా బోలెడంత రెమ్యూనరేషన్ తో పాటు కావాల్సినంత అనుభవం కూడా వచ్చేస్తుంది. అయితే.. ఈ విషయాన్ని బైటకు చెప్పే విధానం మాత్రం వేరుగా ఉంటుంది. స్టోరీ నచ్చింది.. మంచి ఆఫర్ లాంటివేవో చెబుతుంటారు అందాల భామలు.

కానీ ఫ్లోరా శైనీ(మన దగ్గర పేరు ఆషా శైనీ) మాత్రం దక్షిణాది సినిమాలపై కొత్తగా మాట్లాడింది. 'నేను ఇండస్ట్రీకి కొత్త. సినిమాల్లో కనిపించాలనే కోరిక. దక్షిణాదిలో నేను చేసిన సినిమాలు నాకు ఫుడ్డు.. బెడ్డు అందించాయి. బాలీవుడ్ లో పని చేసేందుకు నాకు సౌత్ సినిమాలు హోం వర్క్ లాంటివి. నాలోని యాక్టింగ్ ట్యాలెంట్ చూపించేందుకు.. అందుకే దక్షిణాది సినిమాలకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతాను' అని చెప్పిన ఫ్లోరా శైనీ.. ప్రస్తుతం బేగమ్ జాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

దక్షిణాది సినిమాల్లో గ్లామరస్ రోల్స్ నే చేసిన ఈ భామ.. నార్త్ లో మాత్రం పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్స్ చేస్తుండడం విశేషం. ఇప్పుడు దేశ విభజన కాన్సెప్ట్ బేస్ చేసుకుని తీస్తున్న ఈ చిత్రంలో.. ఆషా శైనీ రోల్ కు చాలానే ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/