Begin typing your search above and press return to search.
ఆ బాలీవుడ్ ట్రెండ్డింగ్ మూవీ డైరెక్టర్ మనోడే
By: Tupaki Desk | 13 Aug 2021 3:01 PM ISTప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మరియు హిందీ ప్రేక్షకులు.. సోషల్ మీడియా జనాలు ప్రతి ఒక్కరు కూడా 'షేర్షా' సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్ర మరియు కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ లో డైరెక్టర్ రిలీజ్ అయ్యింది. అంచనాలకు తగ్గట్లుగా సినిమా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. భాష తో సంబంధం లేకుండా దేశ భక్తి ఉన్న ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్న సినిమా షేర్షా. కార్గిల్ హీరో కథతో రూపొందిన ఈ సినిమా కు వస్తున్న రెస్పాన్స్ తో ప్రస్తుతం ఆ చిత్ర దర్శకుడి గురించిన చర్చ మొదలు అయ్యింది.
షేర్షా దర్శకుడు ఎవరో కాదు మన సౌత్ దర్శకుడు విష్ణువర్థన్. స్టైలిష్ దర్శకుడిగా పేరున్న విష్ణువర్ణన్ షేర్షా ను అద్బుతంగా తెరకెక్కించాడు అంటూ సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయన తెలుగు లో పవన్ కళ్యాణ్ తో స్టైలిష్ పంజా ను తెరకెక్కించాడు. కాని ఏదో కారణం వల్ల ఆ సినిమా బెడిసి కొట్టింది. పవన్ ను అత్యంత స్టైలిష్ గా చూపించడంతో పాటు టేకింగ్ విషయంలో కూడా చాలా ప్రత్యేకంగా ఉండే ఆ సినిమాను ప్రేక్షకులు తిరష్కరించారు. ఆ దెబ్బతో పవన్ అభిమానులకు విష్ణు వర్థన్ అంటే కాస్త కోపం ఏర్పడింది.
తమిళంలో పలు సినిమాలను చేసి హిందీ నుండి వచ్చిన షేర్షా ఆఫర్ ను సద్వినియోగం చేసుకున్న దర్శకుడు విష్ణు వర్ధన్ ఇక అక్కడ సెటిల్ అవ్వడం ఖాయమా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ట్రెండ్డింగ్ లో ఉన్న ఈ సినిమా తో దర్శకుడు విష్ణు వర్థన్ చాలా బిజీ అవుతాడు అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల అయిన వెంటనే ఒకరు ఇద్దరు బాలీవుడ్ మేకర్స్ విష్ణు వర్థన్ కు అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి మన తెలుగు ప్రేక్షకులను నిరాశ పర్చినా కూడా ఇండియన్ ప్రేక్షకులను షేర్షా తో ఆకట్టుకున్న విష్ణు వర్థన్ కు అభినందనలు.