Begin typing your search above and press return to search.

స్టార్డం లేని సౌత్ బ్యూటీ.. బిజీ అవుతోందిగా!

By:  Tupaki Desk   |   28 May 2021 2:30 AM GMT
స్టార్డం లేని సౌత్ బ్యూటీ.. బిజీ అవుతోందిగా!
X
చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడు హీరోయిన్స్ విషయంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే తుఫాన్ వచ్చేముందుగా నిశ్శబ్దం నెలకొన్నట్లుగా అంతవరకు అవకాశాలు లేక ఖాళీగా ఉందనుకున్న హీరోయిన్ ఒక్కసారిగా ఏడు సినిమాలు లైనప్ చేసేసరికి ఆశ్చర్యం కలగకతప్పదు. ప్రస్తుతం అలాంటి షాకింగ్ కబురు చెప్పబోతుంది దక్షిణాది గ్లామర్ బ్యూటీ రెజినా కెసెండ్రా. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన రెజినా మొదటగా తమిళంలోనే సినిమా చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సుధీర్ బాబు సరసన ఎస్ఎంఎస్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ - పవర్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి హిట్స్ తో మంచి ఫామ్ కంటిన్యూ చేసింది. కానీ చివరిగా టాలీవుడ్ హీరోయిన్స్ లిస్టులో మాత్రం చేరలేకపోయింది.

కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ విషయంలో వెనుకాడని రెజినా.. నక్షత్రం - మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో హద్దులు లేని అందాలను ఆరబోసింది. అమ్మడు క్యారెక్టర్ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమని ఇదివరకే చెప్పేసింది. అందుకే రోల్స్ ఉన్నటువంటి స్టోరీస్ కూడా బాగానే వస్తున్నాయట. అందులో తనకు క్రేజ్ ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓకే చేస్తోందట. సినిమాలే కాకుండా రెజినా అందాలకు లక్షలాది అభిమానులు ఉన్నారు. అయితే రెజినా ఈ మధ్య పరంగా స్పీడ్ తగ్గించిందని అందరూ అనుకున్నారు. అవును నిజంగానే అమ్మడు తెలుగులో ఎవరు సినిమా తర్వాత మళ్లీ స్ట్రెయిట్ ఫిల్మ్ చేయలేదు. కానీ డబ్బింగ్ సినిమాలతో పలకరించింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా ఐటమ్ సాంగ్ లో చిందేసింది. లాక్డౌన్ సమయంలో సినిమా అవకాశాలు తక్కువ ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను అదిరే ఫోటోషూట్స్ తో అలరించింది.

ఆ మధ్యలో అవకాశాలు లేక ఈ బ్యూటీని ఎవరు పట్టించుకోట్లే గాని సరిగ్గా కాన్సంట్రేషన్ చేస్తే రెజినా అందాలతో ఇట్టే సెగలు రేపుతోందని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. కానీ అది అప్పుడు ఇది ఇప్పుడు అన్నట్లుగా రెజినా త్వరలోనే తుఫాన్ లా మారబోతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. అందులో నాలుగు తమిళం - 2 తెలుగు సినిమాలు ఉన్నాయట. ఆచార్యలో ఐటమ్ సాంగ్ గురించి పక్కన పెడితే.. రెజినా 'నేనేనా' అనే సినిమాతో పాటు 'మిడ్నైట్ రన్నర్స్' అనే కొరియన్ రీమేక్ సినిమా చేస్తోంది. ఇక తమిళంలో పార్టీ - కళ్ళపార్ట్ - కాసాడా తపరా - సూర్పాంగనై సినిమాలు చేస్తోంది. మొత్తానికి చేతినిండా సినిమాలతో రెజినా త్వరలోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుందట. ఈ అమ్మడికి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయని టాక్. చూడాలి మరి ఈసారి స్టార్డం అందుకుంటుందేమో!