Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: ఫియాన్సీతో సౌందర్య రజనీకాంత్

By:  Tupaki Desk   |   8 Feb 2019 10:22 AM IST
వైరల్ పిక్: ఫియాన్సీతో సౌందర్య రజనీకాంత్
X
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య వివాహం త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మ్యాన్ అయిన విశాగన్ వనంగమూడితో సౌందర్య వివాహాన్ని జరిపేందుకు ఫిబ్రవరి 11 వ తేదీన ముహూర్తం నిర్ణయించారు ఇరు కుటుంబాల పెద్దలు. విశాగన్ కు ఎపెక్స్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. బిజినెస్ మాత్రమే కాకుండా విశాగన్ 'వంజరర్ ఉలగం' అనే సినిమాలో కూడా నటించాడు.

పెళ్లికి జస్ట్ మూడు రోజులే ఉండడంతో రజనీ కుటుంబం లో సందడి నెలకొంది. ఫిబ్రవరి 9 న అంటే.. శనివారం నుండి ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయని సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్ గా సౌందర్య తన ఫియాన్సీతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక సోఫాలో విశాగన్ స్టైలిష్ గా సూటు బూటులో డాబుగా కూర్చున్నాడు. సోఫా వెనక సౌందర్య విశాగన్ పై ప్రేమగా చేతులు వేసి నవ్వుతూ పోజిచ్చింది.

సౌందర్యకు ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. సౌందర్య గతంలో అశ్విన్ అనే వ్యాపారవేత్తను పెళ్ళాడింది. వారికి వేద్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. అతనితో విడాకులు తీసుకుని కొన్నేళ్ళు నాన్నగారి దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు రెండో వివాహానికి ఓకే చెప్పింది. మరోవైపు విశాగన్ వనంగమూడికి ఇది రెండో వివాహమే.