Begin typing your search above and press return to search.

రజినీ క్యారెక్టర్లపై కూతురి క్లారిటీ

By:  Tupaki Desk   |   7 Jun 2018 7:00 AM IST
రజినీ క్యారెక్టర్లపై కూతురి క్లారిటీ
X
రజినీకాంత్ కొత్త మూవీ కాలా రేపు థియేటర్లలోకి వచ్చేస్తోంది. సూపర్ స్టార్ తన మరో చిత్రంగా రోబో సీక్వెల్ 2.ఓ ను ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేయగా.. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు.. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజినీకాంత్.. ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేయడమే కాదు.. షూటింగ్ మొదలుపెట్టేశారు కూడా.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న రజినీ చిత్రం షూటింగ్ మొదలైందని.. ప్రస్తుతం పోయిస్ గార్డెన్ లో.. తలైవార్ తన మరుసటి మూవీ షూటింగ్ కి సిద్ధంగా ఉన్నామని.. ఆయన కూతురు సౌందర్య ఉదయాన్నే ట్వీట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ లో మల్టిపుల్ రోల్స్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను పెట్టడం చర్చనీయాంశం అయింది. తన కొత్త సినిమాలో రజినీకాంత్ పలు విభిన్నమైన పాత్రలను పోషించబోతున్నారంటూ కథనాలు వచ్చేశాయి. తమిళ్ మీడియాలో ఇది విపరీతమైన సంచలనానికి దారి తీసింది.

తన పోస్ట్ లో ఉన్న మిస్టేక్ ను అర్ధం చేసుకున్న సౌందర్యా రజినీకాంత్.. మల్టిపుల్ రోల్స్ అంటే తన ఉద్దేశ్యం సినిమా గురించి కాదని.. జీవితంలో ఆయన బహుళ పాత్రలలో జీవిస్తున్నారని చెప్పింది. ఇక సినిమా గురించి డీటైల్స్ అయితే తానేమీ చెప్పబోనన్న ఈ స్టార్ డాటర్.. తగిన సమయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇతర వివరాలు ఇస్తాడని అంటోంది.