Begin typing your search above and press return to search.

అడిగో రజనీ.. అమెరికా రోడ్లపై..

By:  Tupaki Desk   |   10 Jun 2016 10:26 PM IST
అడిగో రజనీ.. అమెరికా రోడ్లపై..
X
ఓ రెండు రోజులుగా సౌతిండియా మీడియా అంతా ఒకటే హడావిడి. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఆరోగ్యం బాగాలేదని.. అనారోగ్యం కారణంగా ట్రీట్మెంట్ కోసమే అమెరికా వెళ్లారని ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. ఇంకొన్ని మీడియా సంస్థలైతే ఏకంగా రజినీని ఐసీయూలో కూడా జాయిన్ చేసేశాయి. అందుకే.. కబాలి ఆడియో ఫంక్షన్ ను నిర్వహించడం లేదన్నది వీరి వాదన. అయితే.. వీటికి భిన్నంగా మరో వెర్షన్ కూడా ప్రచారం జరిగింది.

ప్రస్తుతం అమెరికాలో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారని.. తర్వాతి సినిమా కోసం కొన్ని మేకప్ టెస్టులకు కూడా రజినీ అటెండ్ అయ్యారనే వార్తలొచ్చాయి. ఇంతకీ సూపర్ స్టార్ అమెరికాలో ఏం చేస్తున్నారో ఇప్పుడు అసలు నిజం తెలిసిపోయింది. అమెరికా రోడ్లపై కూతురుతో కలిసి చక్కర్లు కొట్టేస్తున్నారు రజినీకాంత్. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా ఆయన డాటర్ సౌందర్యే ఓ ఫోటోను పోస్ట్ చేసి మరీ అసలు విషయం వెల్లడించింది. 'సరదాగా మాట్లాడుకుంటూ తండ్రితో అలా రోడ్లపై నడుస్తున్నా' అని రాసుకొచ్చింది సౌందర్య.

దీంతో రజినీ ఆరోగ్యంపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్న వారందరి నోళ్లు మూతబడక తప్పలేదు. సూపర్ స్టార్ ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏం లేదని.. అమెరికాకు నిజంగానే హాలిడే ఎంజాయ్ చేసేందుకు వెళ్లారనే విషయం తేలిపోయింది.