Begin typing your search above and press return to search.

సౌంద‌ర్య ల‌హ‌రి... స్వీట్‌ గా ఉందే

By:  Tupaki Desk   |   4 May 2018 12:14 PM GMT
సౌంద‌ర్య ల‌హ‌రి... స్వీట్‌ గా ఉందే
X
బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా చేస్తున్న నాలుగో చిత్రం ‘సాక్ష్యం’. మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌ను న‌టించిన ‘జ‌య జాన‌కి నాయ‌క‌’ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు సాధించి... ట్రేడ్ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ మ్యాజిక్ అంతా బోయ‌పాటిదే అయినా ఆ సినిమాతో బెల్లంకొండ బుల్లోడికి కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. మాస్ లో ఫాలోయింగూ వ‌చ్చింది.

దాంతో ఆయ‌న త‌ర్వాతి చిత్రం కూడా అదే రేంజ్‌లో ఉండాల‌నే త‌ప‌న‌తో ‘సాక్ష్యం’ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. పంచ భూతాలతో ముడిప‌డిన ప్రేమ‌ అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్‌ తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా నుంచి ‘సౌంద‌ర్య ల‌హ‌రి’ అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. క్లాస్ మెలోడీ మ్యూజిక్ తో సాగే ఈ పాట‌ను ఆనంత్ శ్రీ‌రామ్ రాశాడు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

జితిన్- ఆర్తీ క‌లిసి పాడిన ఈ పాట‌కి ఆర్తీ గొంతు చాలా శ్రావ్యంగా వినిపిస్తోంది. స్వీట్... స్వీట్‌... స్వీటుగా స్మైలు చిందుతుంటే నువ్విలా... అంటూ సాగే లిరిక్స్ బాగున్నాయి కానీ అక్కడక్కడా పాట‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా డామినేట్ చేస్తున్న‌ట్టుగా అనిపిస్తోంది. అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాను ‘డిక్టేట‌ర్‌’ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తున్నాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి