Begin typing your search above and press return to search.

రెండవ పెళ్లికి సిద్దమైన స్టార్‌ హీరో కుమార్తె

By:  Tupaki Desk   |   23 Jan 2019 5:28 AM GMT
రెండవ పెళ్లికి సిద్దమైన స్టార్‌ హీరో కుమార్తె
X
కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చిన్న కుమార్తె సౌందర్య 2017వ సంవత్సరంలో అశ్విన్‌ రామ్‌ కుమార్‌ నుండి విడిపోయిన విషయం తెల్సిందే. ఏడు సంవత్సరాల సంసార జీవితం తర్వాత ఇద్దరి మద్య వివాదం రావడం, అది పెరిగి పెద్దదవ్వడంతో కలిసి జీవితం పంచుకోవడం కష్టమని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. అశ్విన్‌ నుండి విడాకులు తీసుకున్న తర్వాత సౌందర్య కొన్నాళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపింది. ఆ సమయంలోనే ఆమెకు నటుడు మరియు వ్యాపారవేత్త అయిన విశాగన్‌ వినంగమూడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

విశాగన్‌ కూడా భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఇద్దరు కూడా రెండవ పెళ్లి వారే అవ్వడంతో పెద్దగా సమస్య ఏం లేకుండానే పెళ్లికి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. ఇరు కుటుంబ సభ్యుల ఒప్పందంతో తాజాగా సౌందర్య మరియు విశాగన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇక వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఫిబ్రవరి 11న వీరి వివాహం కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరుగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లికి సిద్దం అయ్యారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీరి పెళ్లి గురించి మీడియాలో పెద్దగా హడావుడి లేకుండా జాగ్రత్త పడుతున్నారు.