Begin typing your search above and press return to search.

'సొట్ట బుగ్గల్లో' ప్రోమో: రామారావు - నందినీల ప్రేమ గీతం..!

By:  Tupaki Desk   |   6 May 2022 1:45 PM GMT
సొట్ట బుగ్గల్లో ప్రోమో: రామారావు - నందినీల ప్రేమ గీతం..!
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ మరియు 'కర్ణన్' భామ రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలోని 'బుల్ బుల్ తరంగ్' అనే సాంగ్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో 'సొట్ట బుగ్గల్లో' అనే రెండో పాటను రేపు (మే 7) విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సాంగ్ ప్రోమోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'నేనేనా నేనేనా.. నిన్నా మొన్నా ఉన్నది మరి నేనేనా.. నిన్నేనా నిన్నేనా.. ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. రవితేజ - దివ్యాన్షా కౌశిక్ లపై అందమైన లొకేషన్స్ లో ఈ మెలోడీని చిత్రీకరించారు. ఇది ప్రధాన జోడీ రామారావు - నందినిల మధ్య ప్రేమను తెలియజేస్తోంది.

ఇందులో రవితేజ - దివ్యాన్షా జంట చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. అలానే వారు వేసిన సింపుల్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టుకున్నాయి. 'సొట్ట బుగ్గల్లో' పాటకు సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ట్యూన్ కంపోజ్ చేయగా.. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. హరి ప్రియ - నకుల్ కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. రేపు సాయంత్రం 6.03 గంటలకు 'సొట్ట బుగ్గల్లో' సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్ - సీనియర్ నరేష్ - పవిత్ర లోకేష్ - ‘సర్పట్ట’ జాన్ విజయ్ - చైతన్య కృష్ణ - తనికెళ్ల భరణి - రాహుల్ రామకృష్ణ - ఈరోజుల్లో శ్రీ - మధు సూదన్ రావు - సురేఖ వాణి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.