Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నాటీ.. క‌ల‌ల్లో క‌ల్లోల‌మే

By:  Tupaki Desk   |   6 Jan 2019 9:30 AM GMT
ఫోటో స్టోరి: నాటీ.. క‌ల‌ల్లో క‌ల్లోల‌మే
X
టీవీ హోస్ట్‌.. నటి.. సింగ‌ర్.. మోడ‌ల్ ఇలా ఎన్నో విభాగాల్లో ఉర‌క‌లెత్తిస్తోంది సోఫీ చౌద‌రి. బాలీవుడ్ క‌థానాయిక‌గా సుప‌రిచితం. పోటీబ‌రిలో ఎంద‌రు ఉన్నా ఈ అమ్మ‌డు త‌న ఉనికిని చాటుకునేందుకు నిరంత‌రం ఎదో ఒక యాక్టివిటీని చేప‌డుతూనే ఉంటుంది. ముంబై ఫేజ్ 3 యాక్టివిటీస్ లో సోఫీ హ‌వా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకుంటారు. అందుకే 1-నేనొక్క‌డినే చిత్రంలో లండ‌న్ బాబు.. అనే ఐట‌మ్ నంబ‌ర్ కి సుకుమార్ ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో సోఫీ పేరు మ‌రుగున ప‌డిపోయింది.

కాల‌గ‌మ‌నంలో ఈ అమ్మ‌డు తెర‌కు దూరం జ‌రిగిన‌ట్టే క‌నిపిస్తోంది. 2014 నుంచి సోఫీ కెరీర్ ఖాళీనే. ఇదిగో అప్పుడ‌ప్పుడు ఇలా ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డ‌డం త‌ప్ప తెర‌పై వెలుగులు ప‌రిచిందేం లేదు. వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా, షూట్ ఔట్ ఎట్ వ‌డాలా, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాల్లో సోఫీ న‌ట‌న‌కు గుర్తింపు ద‌క్కింది. ఇక‌ తాజాగా రివీల్ చేసిన ఫోటో తో మ‌రోసారి కుర్ర‌కారులో అగ్గి రాజేస్తోంది.

లేజీగా ఒక‌రోజంతా గ‌డ‌పాలి! అన్న చందంగా ఎంతో లేజీగానే క‌నిపిస్తున్న సోఫీ అందాల్ని ఇలా లోదుస్తుల్లో ఎలివేట్ చేయ‌డంతో ఒక‌టే హాట్ డిస్క‌ష‌న్ సాగుతోంది బోయ్స్ లో. ఈ ఫోటో అంత‌ర్జాలంలో, సామాజిక మాధ్య‌మాల్లో ర‌క‌ర‌కాల మార్గాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఇంత‌గా రెచ్చిపోతే మ‌ళ్లీ పిలుపు అందుకుంటుందేమో? సుకుమార్ మ‌ళ్లీ మ‌హేష్ 26 కోసం ఐటెమ్ నంబ‌ర్ కి పిలిచేస్తాడేమో? ఇప్ప‌టికైతే బోయ్స్ క‌ల‌ల్లో క‌ల్లోల‌మే!