Begin typing your search above and press return to search.

హాట్‌ చౌదరి యమా కిక్కిచ్చిందిగా

By:  Tupaki Desk   |   7 July 2015 5:54 PM GMT
హాట్‌ చౌదరి యమా కిక్కిచ్చిందిగా
X
1-నేనొక్కడినే చిత్రంతో ఐటెమ్‌ భామగా సుపరిచితమైంది సోఫీ చౌదరి. ఆ తర్వాత తెలుగులో కథానాయికగా ఛాన్సులొస్తాయని ఆశించి ఉంటుంది కానీ మనవాళ్లెవరూ పట్టించుకోలేదు. కోలమొహం.. చురుకైన చూపులు, ఆరడుగుల విగ్రహం ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నా తెలుగుదనానికి సరిపోలని రూపురేఖల వల్ల అలా జరిగి ఉండొచ్చు. అయితే తీగలాగా అల్లుకుపోయే చొరవ సోఫీకే సాధ్యం. అందుకే బాలీవుడ్‌లో పదేళ్ల పాటు సుదీర్ఘ కెరీర్‌ని సాగించింది.

షాదీ నెం.1 చిత్రంతో ఉత్తరాది జనాలకు పరిచయమైన ఈ అమ్మడు అంతకంటే ముందే వీడియో ఆల్బమ్స్‌తో జనాల్లో పాపులర్‌ అయ్యింది. చూడగానే వాడి వేడి ఉన్న ఈ రూపం సినిమాలకు పనికొస్తుందని గుర్తించిన బాలీవుడ్‌ దర్శకులు పిలచి మరీ అవకాశాలిచ్చారు. చివరిసారిగా 'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై దొబారా' అనే చిత్రంలో కనిపించింది. ఇటీవలి కాలంలో అక్కడా అవకాశాలు సన్నగిల్లాయి. అందుకే ఇదిగో ఇలా ఫోటోషూట్‌లతో విరుచుకుపడుతోంది. 34 మిడిలేజీలో అడుగుపెట్టిన ఈ పడతి చూపించాల్సినంతా చూపించేస్తోందిలా. ప్రముఖ మ్యాగజైన్‌ ఎఫ్‌హెచ్‌ఎం గర్ట్‌ఫ్రెండ్‌ అంటూ సోఫీ కవర్‌స్టోరీని ప్రచురించింది. ఆ మ్యాగజైన్‌ కవర్‌పేజీ స్టిల్‌ ఇది.