Begin typing your search above and press return to search.

బికినీ బీచ్ లో సొంపుల ఖిల్లా

By:  Tupaki Desk   |   29 May 2019 5:30 PM GMT
బికినీ బీచ్ లో సొంపుల ఖిల్లా
X
చూసేవాళ్లున్న‌ప్పుడు చూపించేవాళ్లుంటారు! అర్థం చేసుకునే మ‌న‌సుంటే అదో ర‌కం క‌ళ‌! ఈ క‌ళ‌లో ఆరి తేరిపోయిన ముద్దుగుమ్మ‌లెంద‌రో. హాట్ స‌మ్మ‌ర్ వెకేష‌న్ పేరుతో ఒంట‌రి దీవుల‌కు ప‌య‌న‌మ‌వుతున్న భామ‌ల్లో ప‌లువురు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో యూత్ కి మ‌తి చెడే ట్రీటిస్తున్నారు. ఇప్ప‌టికే డ‌జ‌న్ల కొద్దీ ఉత్త‌రాది- ద‌క్షిణాది క‌థానాయిక‌లు విదేశీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో ఫుల్ గా చిలౌట్ చేస్తున్నారు.

ఆ కోవ‌లోనే ఇదిగో `1- నేనొక్క‌డినే` ఐటెమ్ గాళ్ సోఫీ చౌద‌రి బికినీ బీచ్ లో అడ్డంగా దొరికిపోయిందిలా. క‌జుర‌హో శిల్పాన్ని బికినీ బీచ్ కి తెచ్చారా? అన్న సందేహం క‌లిగేలా అచ్చం ఉలి వేసి చెక్కిన శిల్పానికి మ‌రు రూపంలా క‌నిపించింది. బ్లాక్ బికినీలో ఈ అమ్మ‌డు ఇచ్చిన ట్రీట్ బోయ్స్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

లండ‌ను బాబు లండ‌ను బాబు ఇండియ‌న్ డాల‌ర్ నేను!! అంటూ అపుడెపుడో మ‌హేష్ సినిమాలో ఆటాపాట‌తో క‌నిపించింది. మ‌ళ్లీ ఇన్నాళ్టికి ఈ అమ్మ‌డు ఇలా క‌నిపించే స‌రికి ఒక‌టే చ‌లి జ్వ‌రం ఫీల‌వుతున్నారంతా. పైగా ఇంత వేడిగా బికినీలో వ‌య్యారాల్ని వ‌డ్డించిన అమ్మ‌డు ఏకాగ్ర‌త‌! అంటూ స్పెష‌ల్ క్లాస్ తీస్కుంది. ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి వ‌ర్క‌వుట్లు చేస్తే కానీ ఈ ఒంపు సొంపుల ఖిల్లా సాధ్య‌ప‌డ‌లేద‌ని చెబుతోంది. ఫిజిక‌ల్ గా మెంటల్ గా ఎంతో శ్ర‌మిస్తే కానీ ఇంతందం సాధించ‌లేమ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం మాల్దీవుల సెల‌బ్రేష‌న్స్ లో బిజీబిజీగా ఉంది. ఈ ఫోటో చూసి ఆ ఒంపు సొంపుల్ని స్కెచ్ లు గీయ‌డంలో కొంద‌రు బోయ్స్ బిజీ.