Begin typing your search above and press return to search.

ఈవిడ విలాసాలు త‌ట్టుకోవ‌డం క‌ష్టం!

By:  Tupaki Desk   |   9 Feb 2019 1:30 AM GMT
ఈవిడ విలాసాలు త‌ట్టుకోవ‌డం క‌ష్టం!
X
ముంబై ఫేజ్ 3 గాళ్స్ లో సోఫీ చౌద‌రి స్పీడ్ గురించి చెప్పాల్సిన‌ ప‌నే లేదు. ఆర‌బోత ఫోటోషూట్ల‌తో ఈ అమ్మ‌డు నిరంత‌రం యువ‌త‌రంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో సోఫీలోని ర‌క‌ర‌కాల వ్య‌స‌నాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇండో అమెరిక‌న్ గాళ్ గా సోఫీ తొలుత టీవీ వీజేగా రాణించింది. ఆ త‌ర్వాత పార్టీ క్రౌడ్ లో చేరి, ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో ప‌రిచ‌యాల‌తో న‌టిగా రూపాంత‌రం చెందింది. అయితే ఈ అమ్మడి ఐటెమ్ భామ లుక్ చూసి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆ దిశ‌గా అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు. అలా ఐటెమ్ భామ‌గా స్థిర‌ప‌డింది. ఆ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్ లోని 1 - నేనొక్క‌డినే చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ తో ర‌ఫ్ఫాడించింది.

అయితే సోఫీ ఆ త‌ర్వాత అర‌డ‌జ‌ను పైగానే హిందీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది. వ‌రుస‌గా ఐటెమ్ నంబ‌ర్ల‌లోనూ మైమ‌రిపించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి కెరీర్ అంతంత మాత్ర‌మే అయినా మోడ‌లింగ్ ప్ర‌పంచంలో బండి లాగించేస్తోంది. సోఫీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 8 ఫిబ్ర‌వ‌రి 1976 న జ‌న్మించింది. అంటే ఇప్ప‌టికి వ‌య‌సు 42. ఏజ్ బార్ అయినా టెరా బైట్ స్పీడ్ ఎప్పుడూ మెయింటెయిన్ చేస్తోంది. ఇటాలియ‌న్ న‌టి సోఫీ లారెన్ కి అభిమాని అయిన సోఫీ డాడ్ త‌న ఫేవ‌రెట్ స్టార్ పేరును కూతురికి పెట్టేయ‌డంతో ఆ పేరుతోనే పాపుల‌ర్ అయిపోయింది. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసి అటుపై బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్క‌డ క‌రిష్మా క‌పూర్, క‌రీనా, గౌరీఖాన్ వంటి టాప్ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు త‌న‌కు.

తాజాగా సోఫీ లేటెస్ట్ ఫోటో షూట్స్ వెబ్ ప్ర‌పంచంలో ప్ర‌త్య‌క్ష‌మై కుర్ర‌కారుకు కంటిమీద కునుకు లేకుండా చేసేస్తున్నాయి. అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌ని సోఫీ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. రంగుల ప్ర‌పంచంలో ఇమేజ్ ని కాపాడుకోవాలంటే ఇంత‌గా శ్ర‌మించాల్సి ఉంటుంద‌ని ఈ అమ్మ‌డిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.