Begin typing your search above and press return to search.

బికినీకి ఎక్కువ‌.. టూపీస్ కి త‌క్కువ

By:  Tupaki Desk   |   29 Jan 2019 1:30 AM GMT
బికినీకి ఎక్కువ‌.. టూపీస్ కి త‌క్కువ
X
త‌న‌వైన అంద‌చందాల‌తో ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది వీజే కం న‌టి సోఫీ చౌద‌రి. ఈ అమ్మ‌డు సినీ కెరీర్ కంటే ఫేజ్ 3 పార్టీల్లో మ‌త్తెక్కించే ఫోటోషూట్ల‌తోనే ఎక్కువ‌గా పాపుల‌రైంది. ఓవైపు ఎంటీవీ వీజేగా వేడెక్కించిన ఈ బ్యూటీ ప‌లు ఆంగ్ల చానెల్స్ లో ప‌ని చేసిన అనుభ‌వంతో .. రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో హ‌వా సాగిస్తోంది. అయితే బాలీవుడ్ లో క‌థానాయిక‌గా వెల‌గాల‌న్న ల‌క్ష్యం మాత్రం నెర‌వేరలేదు. ముంబై ప‌రిశ్ర‌మ త‌న‌ని ఓ ఐటెమ్ గాళ్ గా మాత్ర‌మే చూస్తోంది మిన‌హా ప్ర‌త్యేకించి హీరోయిన్ గా మాత్రం ఓకే చేయ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే ప‌లు చిత్రాల్లో స్పెష‌ల్ రోల్స్ కే ప‌రిమిత‌మైంది.

ఈ హాట్ గాళ్ టాలీవుడ్ లోనూ అడుగుపెట్టినా ఇక్క‌డ స‌రైన ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `1-నేనొక్క‌డినే` చిత్రంలో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ తో వేడెక్కించింది. అయితే ఆ త‌ర్వాత మాత్రం అవ‌కాశాలు ద‌క్క‌లేదు ఎందుక‌నో. ప్ర‌స్తుతం సోఫీ సోషల్ మీడియా క్వీన్ గా పాపుల‌ర‌వుతోంది.

తాజాగా సోఫీ చౌద‌రి ఇన్ స్టాగ్ర‌మ్ లో వేడెక్కించే ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో బోల్డ్ లుక్ తో యువ‌త‌రాన్ని మ‌త్తెక్కిచింది. ఈ లుక్ చూడ‌గానే బికినీకి ఎక్కువ‌ - టూపీస్ కి త‌క్కువ అన్న చందంగానే క‌నిపిస్తోంది. త‌న బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ డిజైన‌ర్ డ్రెస్ తో మైమ‌రిపిస్తోంది. ఒక్క సారి చూడు .. మ‌తి చెడుతుంది. అదిరిపోయే స్టైలింగ్ అంటూ సోఫీ చాలానే గారాలు పోతోంది. రాహుల్ జింగానియా దీనిని డిజైన్ చేశారు.