Begin typing your search above and press return to search.

విడుదలైన రెండేళ్లకు ఇప్పుడు ట్రెండింగ్

By:  Tupaki Desk   |   9 Jun 2020 2:30 PM GMT
విడుదలైన రెండేళ్లకు ఇప్పుడు ట్రెండింగ్
X

రెండున్నర నెలలుగా థియేటర్లు ఓపెన్‌ అవ్వడం లేదు.. గత రెండు నెలలుగా టీవీల్లో ప్రసారం చేసేందుకు సీరియల్స్‌ ఎపిసోడ్స్‌ పూర్తి అయ్యాయి అలాగే రియాల్టీ షోలు కూడా షూట్‌ చేసి లేవు. దాంతో పాత సినిమాలు పాత సీరియల్స్‌ ను ఛానెల్స్‌ వేస్తున్నాయి. ఈ సమయంలోనే ఓటీటీ బిజినెస్‌ కూడా భారీగా పెరిగింది. అంది వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో అమెజాన్‌ నెట్‌ ప్లిక్స్‌ వంటి ఓటీటీ సంస్థలు భారీగా ప్రచారం చేస్తున్నాయి.

ఓటీటీల్లో ఈమద్య పోస్ట్‌ అయినవే కాకుండా పాత సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. నెట్‌ ప్లిక్స్‌ లో దాదాపు రెండు సంవత్సరాలుగా స్ట్రీమింగ్‌ అవుతున్న చిత్రం ‘సూర్మా’. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్‌ సింగ్‌ బయోపిక్‌ అయిన సూర్మా చిత్రం కమర్షియల్‌ గా సక్సెస్‌ కాలేదు. థియేటర్ల నుండి చాలా త్వరగా సినిమా వెళ్లి పోయింది. అప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.

సూర్మా చిత్రంను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు మాత్రం సినిమా గురించి సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ తెగ చర్చించుకుంటున్నారు. నెట్‌ ప్లిక్స్‌ లో కూడా ప్రస్తుతం ఈ మూవీ ట్రెండ్‌ అవుతోంది. అత్యధికులు చూస్తున్న చిత్రంగా ఇది ఈమద్య కాలంలో నిలిచింది. ప్రస్తుతం థియేటర్లు లేని కారణంగా ఓటీటీ మూవీస్‌ నే ఎక్కువగా ఆశ్రయిస్తున్న ప్రేక్షకుకు సూర్మా బాగా నచ్చింది.

ప్రముఖ హాకీ క్రీడాకారుడు అయిన సందీప్‌ సింగ్‌ ప్రేమలో పడి ఆటలో ఎలా చేరతాడు. ఆ తర్వాత నడుము విరగడంతో లేవలేని పరిస్థితి నుండి మళ్లీ హాకీ గ్రౌండ్‌ లో ఎలా అడుగు పెడతాడు వంద గోల్స్‌ ఎలా కొట్టాడు అనేది సినిమా కథాంశం. నెట్‌ ప్లిక్స్‌ లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సూర్మాను వీలుంటే మీరు ఒక లుక్కేయండి.