Begin typing your search above and press return to search.

మెగా హీరోకి భారీ అడ్వాన్స్ ఇచ్చిన సోని..!

By:  Tupaki Desk   |   7 April 2022 10:00 PM IST
మెగా హీరోకి భారీ అడ్వాన్స్ ఇచ్చిన సోని..!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ మరికొన్ని గంటల్లో 'గని' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కిరణ్ కొర్ర పాటి దర్శకత్వంలో గని సినిమా ను అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తర్వాత వరుణ్‌ ఎఫ్ 3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో వరుణ్ సోని ఎంటర్ టైన్మెంట్స్ వారితో ఒప్పందం చేసుకున్నాడట.

సోని ఎంటర్‌ టైన్‌మెంట్స్ వారు ఈమద్య సౌత్‌ లో కూడా సినిమాలను నిర్మించేందుకు మరియు వెబ్‌ సిరీస్‌ లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ తో ప్రాజెక్ట్‌ కు గాను ఏకంగా 18 కోట్ల రూపాయలతో ఢీల్‌ ను కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం భారీ మొత్తంలో అడ్వాన్స్ ను కూడా వరుణ్‌ ఇప్పటికే తీసుకున్నాడని కూడా సమాచారం అందుతోంది.

సోని వారు ప్రస్తుతం ఒక భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ను వరుణ్‌ తేజ్ తో ప్లాన్‌ చేస్తున్నారట. అది సినిమా నా లేదా వెబ్‌ సిరీస్ అయ్యి ఉంటుందా అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది. సోని వారి నుండి ఇప్పటి వరకు వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఉత్తర భారతంలో మంచి డిమాండ్ ను కలిగి ఉంటాయి. కనుక వరుణ్‌ తో వారు చేయబోతున్న ప్రాజెక్ట్‌ ఖచ్చితంగా ఒక భారీ ప్రాజెక్ట్‌ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

వరుణ్ తేజ్ హీరోగా వారు చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి ఒకటి రెండు వారాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుణ్‌ చేతిలో ఉన్న గని మరియు ఎఫ్ 3 సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యాయి. కనుక వెంటనే సోని వారి కి వరుణ్‌ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. వరుణ్‌ ఈ ఏడాదిలోనే సోని వారి ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.

మెగా ఫ్యామిలీ హీరోలు మెల్ల మెల్లగా బాలీవుడ్‌ లో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ తో రామ్‌ చరణ్ కు బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కింది. పుష్ప సినిమా తో అల్లు అర్జున్‌ కూడా పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు. కనుక వరుణ్‌ తేజ్ కూడా త్వరలోనే సోని వారి బ్యానర్‌ లో చేయబోతున్న సినిమా లేదా వెబ్‌ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.