Begin typing your search above and press return to search.

30మందిని ప్రాణాలతో కాపాడిన సోను సూద్ బృందం

By:  Tupaki Desk   |   14 May 2021 9:00 PM IST
30మందిని ప్రాణాలతో కాపాడిన సోను సూద్ బృందం
X
ఎప్పుడొచ్చామన్నది కాదు.. సరిగ్గా ప్రజలు ప్రాణాలు కాపాడామా? లేదా? ఇలా పోయిన లాక్ డౌన్ లో దేశంలో హీరో అయిపోయిన సోనూ సూద్ తన సేవా పరంపరను కొనసాగిస్తున్నాడు.తన టీంతో దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తూ అందరికి ఆయువు పోస్తున్నారు.

సోను సూద్ నిజంగా రియల్ లైఫ్ హీరో అని నిరూపిస్తున్నారు. అతడి ఆర్థిక , వైద్య సహాయం ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కాపాడింది. యాదృచ్ఛికంగా, సోను సూద్ బృందం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో సుమారు 30 మంది ప్రాణాలను తాజాగా రక్షించింది.

ఈ వారం ప్రారంభంలో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజ్ కనుగొనబడింది. వైద్య బృందం వెంటనే సహాయం కోసం సోను సూద్ బృందాన్ని సంప్రదించారని తెలిసింది. ఈ బృందం త్వరగా స్పందించి తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో స్థానిక పోలీసులతోపాటు ఆసుపత్రికి చేరుకుంది.

వారు ఆక్సిజన్ సకాలంలో అందించడంతో చివరి నిమిషంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. 30 మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడబడ్డాయి, సోను సూద్ బృందం నుంచి చురుకైన ప్రతిస్పందనకు రోగులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రీమా సువర్ణ మరియు ఆసుపత్రి నిర్వహణ అందరూ సోనీ సూద్ బృందంపై సకాలంలో స్పందించినందుకు ప్రశంసలు కురిపించారు.