Begin typing your search above and press return to search.

తిర‌స్క‌రించిన చోటే రాబ‌ట్టుకున్న సోనూ!

By:  Tupaki Desk   |   31 May 2021 12:24 PM IST
తిర‌స్క‌రించిన చోటే రాబ‌ట్టుకున్న సోనూ!
X
పోగొట్టుకున్న‌ చోటే రాబ‌ట్టుకోవ‌డం అనేది కొంద‌రికే కుదిరే విద్య‌. ఇప్పుడు న‌టుడు సోనూసూద్ తాను ఆశించిన‌ది ద‌క్క‌ని చోటే ఇప్పుడు గౌర‌వం అందుకున్నాడు. ఒకప్పుడు మ్యాగజైన్ క‌వ‌ర్ షూట్ కోసం ఆడిషన్ చేసినప్పుడు సోను సూద్ తిరస్కర‌ణ‌కు గురయ్యారట‌. అతను ఇప్పుడు అదే మ్యాగ‌జైన్ ముఖచిత్రంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

తాజాగా ఇదే విషయాన్ని ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. ఒకసారి మ్యాగజైన్ షూట్ కోసం తన ఫోటోల‌ను పంపాన‌ని.. కానీ స‌ద‌రు మ్యాగ‌జైన్ ఎడిటోరియ‌ల్ విభాగం తిర‌స్క‌రించింద‌ని చెప్పాడు. ఇటీవల అదే పత్రిక ముఖచిత్రంలో తాను కనిపించిన విష‌యాన్ని గుర్తు చేశాడు.

స్టార్ డస్ట్ మ్యాగజైన్ ఏప్రిల్ సంచిక ముఖచిత్రంలో సోను సూద్ క‌నిపించారు. తన మోడ‌లింగ్ న‌ట‌న‌కు సంబంధించిన‌ ప్రయాణంలో ఒడిదుడుకుల్ని గుర్తు చేసుకున్నారు. అతను ఒకసారి అదే పత్రికలో ఫోటోషూట్ కోసం ప్ర‌య‌త్నిస్తే ఎదురైన తిర‌స్కారాన్ని ప‌దే ప‌దే గుర్తు చేసుకున్నారు. ``స్టార్ డస్ట్ ఆడిషన్ కోసం నేను పంజాబ్ నుండి నా ఫోటోలను పంపిన ఒక రోజు ఉంది. కానీ తిరస్కరించారు. ఈ రోజు ఈ మనోహరమైన కవర్ పేజీతో గౌర‌వించిన‌ స్టార్ డస్ట్ కు ధన్యవాదాలు`` అని అన్నారు. 2020-21 సీజ‌న్ లో భార‌త‌దేశం క‌రోనాతో అల్లాడుతుంటే సోనూసూద్ ఒక సూప‌ర్ హీరోగా మారి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే అత‌డికి అన్నివ‌ర్గాల్లోనూ ఇమేజ్ గుర్తింపు మ‌రింత పెరిగాయి. ఒక గొప్ప న‌టుడిగానే కాదు.. సామాజిక సేవికుడిగా మాన‌వ‌తా ధృక్ప‌థం ఉన్న రియ‌ల్ హీరోగా మ‌న్న‌న‌లు అందుకుంటున్నాడు.