Begin typing your search above and press return to search.

సైకిల్ తొక్కుకుంటూ వచ్చి సర్ప్రైజ్ చేసిన రియల్ హీరో..!

By:  Tupaki Desk   |   14 April 2021 9:32 AM GMT
సైకిల్ తొక్కుకుంటూ వచ్చి సర్ప్రైజ్ చేసిన రియల్ హీరో..!
X
కరోనా విపత్కర పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అనేక సామాజిక కార్యకలాపాలు చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. లాక్ డౌన్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూ సహాయం కోరిన వారికి రెండో ఆలోచన లేకుండా ఆదుకోవడానికి ముందుకొస్తున్నాడు. ఇదంతా తన సంతృప్తి కోసం మాత్రమే చేస్తున్నానని.. మరే ఇతర ప్రయోజనం కోసం కాదని పదే పదే చెప్తూ వచ్చిన సోనూ.. రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఏది చేసినా అందరి ఫోకస్ ఆయనపై పడుతోంది. తాజాగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో సైకిల్ తొక్కుతూ కనిపించి వార్తల్లో నిలిచాడు.

అయితే సోనూసూద్ సైకిల్ ఎక్కింది కోలీవుడ్ హీరో విజయ్ తరహాలో పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల‌ పెరుగుదలకు నిర‌స‌న‌గా అనుకుంటే పొరపాటే. సోనూ సైకిల్ ప్ర‌యాణం సినిమా షూటింగ్ మరియు ఆరోగ్యం కోసం. సోనూ ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోకా పేట‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్లో జ‌రుగుతోంది. దీని కోసం పార్క్ హ‌య‌త్ లో బస చేసిన సోనూసూద్.. ఈరోజు ఉదయం అక్క‌డి నుంచి లొకేష‌న్ కు కార్ లో వెళ్లకుండా సైకిల్ పై బ‌య‌ల్దేరాడు. దాదాపు అరగంట పాటు సైక్లింగ్ చేసి లొకేష‌న్‌ కి చేరుకొని అందరినీ సర్ప్రైజ్ చేసాడు సోనూ.