Begin typing your search above and press return to search.

కూర‌గాయ‌ల బండికి సోనూసూద్ ప్ర‌చారం

By:  Tupaki Desk   |   6 Nov 2021 12:40 PM GMT
కూర‌గాయ‌ల బండికి సోనూసూద్ ప్ర‌చారం
X
సేవే ప‌ర‌మావ‌ధి.. మాన‌వ సేవే మాధ‌వ సేవ‌! అంటూ ఇలాంటి మార్గాన్ని ఎన్నుకుని ముందుకు వెళ్లి ప్ర‌జ‌లకు సాయం చేసేవారు స‌మాజంలో చాలా త‌క్కువ. ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో అనూహ్యంగా న‌టుడు సోనూసూద్ పేరు సేవికుడిగా బ‌ల‌ప‌డింది. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌భుత్వాలే చేతులెత్తేయ‌గా సొంత ఖ‌ర్చుల‌తో కార్మికుల‌ను త‌మ ఇండ్ల‌కు చేర్చ‌డంలో అత‌డు చేసిన సేవ‌ల్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. గ‌డిచిన రెండేళ్ల‌లో అత‌డి ఇమేజ్ ప్ర‌జ‌ల్లో అమాంతం పెరిగింది. ఆప‌ద్భాంధ‌వుడిగా గుర్తింపును పొందాడు సోను సూద్.

రైతులు కార్మికులు కూలీలు రోగులు ఇలా అన్ని వ‌ర్గాల‌కు అత‌డు సాయం చేశాడు. క‌రోనా రోగుల‌కు అత‌డు చేసిన సేవ‌ల్ని మ‌ర్చిపోలేం.

దీంతో దేశవ్యాప్తంగా పలువురు తమ సమస్యలను సోనూసూద్‌ దృష్టికి సోషల్‌ మీడియా ద్వారా తీసుకెళుతున్నారు. వీలున్నంత వ‌ర‌కూ స‌మ‌స్య‌తో వ‌చ్చిన వారికి ప‌రిష్కారం చూపిస్తున్నారు సోను సూద్. దీంతో అతడి సేవ‌లు అందుకున్న ప్ర‌జలు కృత‌జ్ఞ‌తా భావంతో ఉన్నారు.

తాజాగా అత‌డు కూర‌గాయ‌ల బండి న‌డిపించే చిరు వ‌ర్త‌కుడికి కావాల్సిన ప్ర‌చారం చేసారు. త‌న ఇంటి ముందుకు వ‌చ్చిన ఇద్ద‌రు వ‌ర్త‌కుల‌తో అత‌డు ముచ్చ‌టించారు. వారి వ్యాపారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వారు ఎక్క‌డి నుంచి వ‌చ్చి శ్ర‌మిస్తున్నారో అడిగారు. బండి మీద తాజా కాయ‌గూర‌లు కొనుక్కోవాలని వాటితో ఆరోగ్యం సాధ్య‌మ‌ని సోను సూద్ ప్ర‌చారం చేశారు. బండి లాగుతూ కూరగాయలు ఆమ్మే వారి వద్ద కొంటే చిన్న వ్యాపారులకు సాయం చేసిన‌వారం అవుతామ‌ని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోనూసూద్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇది సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.'' తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్‌ చేయండి'' అన్న వ్యాఖ్య‌ను త‌న వీడియోకి జోడించారు.

ఎన్నిక‌ల్లో వాగ్ధానాలు చేసిన నాయ‌కులంతా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాలంటూ సోనూసూద్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా అత‌డు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న ప్ర‌చారం న‌డుమ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ ఎక్కువ‌గా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు త‌గిన‌న్ని సినిమాల్లో న‌టిస్తూ సోను సూద్ బాగానే ఆర్జిస్తున్నాడు. తెలుగులో ఆచార్య స‌హా ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు.