Begin typing your search above and press return to search.

తెగ ఆకట్టుకుంటున్న సోనూ సూద్ గెటప్

By:  Tupaki Desk   |   6 Oct 2020 1:30 AM GMT
తెగ ఆకట్టుకుంటున్న సోనూ సూద్ గెటప్
X
ఇప్పుడు దేశమంతా సోనూ సుద్ నామస్మరణతో ఊర్రూత లూగుతోంది. ఆయన కరోనా లాక్ డౌన్ వేళ వేల మంది అన్నార్థుల ఆకలి తీర్చారు. వారి కష్టాలను గట్టెక్కించారు. అందరికీ సాయం చేశారు. దేశంలోనే గొప్ప మానవతావాదిగా పేరొందారు.

దీంతో ఇప్పుడు సోనూ సూద్ కు సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతోంది. అప్పట్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాలో కూడా మొదట సోనూసూద్ నటించారు. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మధ్యలో సినిమా నుంచి తప్పుకున్నాడు.

తాజాగా ‘మణికర్ణిక’ సినిమాలో సోనూ సూద్ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దర్శకుడు క్రిష్ తో కలిసి తన సిక్స్ ప్యాక్ తో కండల వీరుడిగా.. గంభీరంగా నడుస్తున్న సోనూ గెటప్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి ‘జీవితంలో మంచి కోసం నడవండి.. ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు’ అనే క్యాప్షన్తో ఫొటో షేర్ చేశారు.

ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. మణికర్ణికలో సోనూ గెటప్ సిక్స్ ప్యాక్ కాక రేపుతోంది. సోనూ కనుక నటించి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేదని ఆ పిక్ చూశాక అంటున్నారు.

అయితే సినిమాలో మార్పులు చేయాలని.. సోనూ సూద్ పాత్రను తగ్గించాలని కంగనా వాదించడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే టాక్ బాలీవుడ్ లో ఉంది.. సోనూ సూద్ కూడా వైదొలిగినట్టు సమాచారం.