Begin typing your search above and press return to search.

అందాల నిధితో సోనూ సూద్ సరి కొత్తగా..!

By:  Tupaki Desk   |   4 Aug 2021 6:30 AM GMT
అందాల నిధితో సోనూ సూద్ సరి కొత్తగా..!
X
గత ఏడాది నుండి విలన్ సోనూ కాస్త రియల్‌ హీరో సోనూ సూద్‌ అయ్యాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది పట్ల దేవుడుగా నిలిచిన సోనూసూద్‌ ఆ తర్వాత కూడా ఎంతో మంది కష్టాలను తీర్చాడు. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సీజన్‌ లేక ఎంతో మంది అవస్థలు పడుతున్న సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆక్సీజన్‌ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సీజన్ ప్లాంట్స్ తో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సోనూసూద్‌ ను ఇప్పుడు జనాలు విలన్ గా చూడాలనుకోవడం లేదు. స్క్రీన్‌ పై కూడా ఆయన్ను హీరోగానే చూడాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. విలన్ గా సినిమాల్లో ఆయన్ను చూపించినా కూడా వెండి తెరలపై చెప్పులు పడుతాయేమో అనే ఆందోళన కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. హీరోగా సోనూసూద్‌ సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ముందు ముందు విలన్‌ గానే కాకుండా హీరోగా కూడా కనిపిస్తానంటూ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటే అలా కనిపించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. సోనూసూద్‌ సాథ్ క్యా నిభాగోగే అనే మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈమద్య కాలంలో స్పెషల్‌ మ్యూజిక్ సాంగ్స్‌ కు మంచి డిమాండ్‌ ఉంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున మ్యూజిక్‌ వీడియోలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సోనూసూద్‌ తో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఫరాహ్‌ ఖాన్‌ ఈ మ్యూజిక్ వీడియోను తెరకెక్కించారు. ఈ వీడియోలో సోనూసూద్‌ కు జోడీగా నిధి అగర్వాల్‌ కనిపించింది. సోనూ సూద్‌ మరియు నిధి అగర్వాల్‌ లు ఈ పాటలో జోడీగా కనిపించబోతున్నారు. తాజాగా వీరిద్దరి పోస్టర్‌ ను విడుదల చేశారు.

సాథ్ క్యా నిభాగోగే మ్యూజిక్ వీడియోకు సంబంధించిన పోస్టర్‌ విడుదల అయ్యింది. సోనూ సూద్ మరియు నిధి అగర్వాల్‌ ల లుక్‌ సూపర్బ్‌ గా ఉంది. ముఖ్యంగా సోనూసూద్ రియలిస్టిక్ గా హీరోగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ మ్యూజిక్ వీడియోకు సంబంధించిన ట్రైలర్‌ ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మ్యూజిక్‌ వీడియో విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు.

ఈ మ్యూజిక్ వీడియో గురించి సోనూ సూద్‌ స్పందిస్తూ.. పాట చాలా విభిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌ ను ఎప్పుడు చేయలేదు అని.. కొత్తగా నన్ను చూస్తారంటూ నమ్మకం వ్యక్తం చేశాడు. ఫరాహ్‌ ఖాన్‌ తో వర్క్ చేయడం చాలా సంతోషంను కలిగించిందన్నాడు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్‌ మట్లాడుతూ.. సోనూ సూద్‌ మరియు ఫరాహ్‌ ఖాన్‌ తో వర్త్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. తప్పకుండా ఈ మ్యూజిక్‌ వీడియో అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేసింది.

ఈ మ్యూజిక్ వీడియోలో సోనూసూద్‌ హీరోయిజంను చూపించడంతో పాటు ఆయన చేసిన సేవా కార్యక్రమాలను కూడా ప్రస్తావిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక విలన్‌ గా ఆచార్య సినిమాలో సోనూసూద్‌ కనిపించబోతున్నాడు. ముందు ముందు రోజుల్లో సోనూ సూద్‌ విలన్ గా నటించే అవకాశాలు లేవని.. ఆయన్ను ఖచ్చితంగా హీరోగానే ప్రేక్షలు చూడబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఈ పాట తో పాటు హీరోగా ఒకటి రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. అతి త్వరలోనే ఈయన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సోనూసూద్‌ హీరోగా సినిమాలు చేస్తే పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.