Begin typing your search above and press return to search.

బెల్లంకొండ సెట్ లో సోను దాదా హంగామా

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:30 PM GMT
బెల్లంకొండ సెట్ లో సోను దాదా హంగామా
X
`రాక్ష‌సుడు` చిత్రంతో స‌క్సెస్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ఈ థ్రిల్ల‌ర్ మూవీ త‌రువాత శ్రీ‌ను ప్లానింగ్ పెద్ద స్థాయిలోనే ఉంది. ఈసారి ఆడియ‌న్స్ కి మాస్ ఎంట‌ర్ టైనర్ ని అందించాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ తో క‌లిసి `అల్లుడు అదుర్స్‌` అనే మూవీ చేస్తున్నాడు. నూత‌న నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడు నెల‌ల విరామం త‌రువాత ఇటీవ‌లే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ పునః ప్రారంభ‌మైంది.

న‌భా న‌టేష్- అను ఇమ్మానుయేల్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన‌డం కోసం ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు సొను సూద్‌. ఇందులో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సోమ‌వారం ఈ మూవీ సెట్ ‌లో ఆయ‌న సంద‌డి చేశారు. లాక్ ‌డౌన్ స‌మ‌యంలో యావ‌త్ దేశ వ్యాప్తంగా సొనూ హీరో అనిపించుకున్న విష‌యం తెలిసిందే.

సోమ‌వారం బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌- ప్ర‌కాష్‌రాజ్‌- న‌భా న‌టేష్‌- బ్ర‌హ్మాజీ- శ్రీ‌నివాస‌రెడ్డి- స‌త్య‌- కాదంబరి కిర‌ణ్ - చ‌మ్మ‌క్ చంద్ర‌- దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మ‌క కంటెంట్ తో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. `అల్లుడు అదుర్స్‌` టైటిల్‌కు ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ‌ల‌కూ అన్ని వ‌ర్గాల నుంచి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించిందని నిర్మాత చెబుతున్నారు. త్వ‌ర‌లో టీజ‌ర్ ‌ని రిలీజ్ చేసి 2021 సంక్రాంతికి మూవీని విడుద‌ల చేస్తార‌ట‌.