Begin typing your search above and press return to search.

సోనూసూద్ హీరో.. పూరీ ద‌ర్శ‌కుడు..! జ‌న‌గ‌ణ‌మ‌న పాడించేస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   11 April 2021 5:48 AM GMT
సోనూసూద్ హీరో.. పూరీ ద‌ర్శ‌కుడు..! జ‌న‌గ‌ణ‌మ‌న పాడించేస్తాడ‌ట‌!
X
కొన్ని విష‌యాలను టైమ్ డిసైడ్ చేస్తుంది అంటారు. ఇలాంటి సంద‌ర్భాల‌ను చూసిన‌ప్పుడు నిజ‌మే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడి మ‌దిలో ఎన్నో ఆలోచ‌న‌లు మెదులుతుంటాయి. అందులో కొన్ని క‌థ‌లుగా మారుతుంటాయి. అందులోనూ అత్యంత ఇష్టంగా ఎంచుకున్న‌వి కొన్ని ఉంటాయి. అలా.. పూరీ జ‌గ‌న్నాథ్ ఇష్టంగా రాసుకున్న క‌థ ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’!

మ‌హేష్ బాబు గ‌న‌క పాడేస్తానంటే.. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ప‌క్క‌కు పోయింది. సూప‌ర్ స్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే వ‌ల్లే ఆగిపోయింద‌ని అంటుంటారు. అయితే.. ఈ క‌థ సిద్ధం చేసుకోని చాలా సంవ‌త్స‌రాలు అవుతోంది. ఇప్పుడు.. సోనూసూద్ ను పెట్టి, అదే క‌థ‌ను తీయ‌బోతున్నాడ‌ట డాషింగ్ డైరెక్ట‌ర్‌.

దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి క‌థ స్టేల్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. రెండోది.. నేష‌న‌ల్ ఐకాన్ గా.. సోనూసూద్ పేరు దేశ‌వ్యాప్తంగా మారిపోతుండ‌డం కార‌ణం కావొచ్చు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందించిన క‌థ కాబ‌ట్టి.. సోనూ అయితే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని పూరీ భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ‘లైగ‌ర్‌’ రూపొందిస్తున్నాడు పూరీ. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ స్టార్ య‌శ్ తో సినిమా అనుకుంటున్నాడు. దాని త‌ర్వాత సోనూ లైన్లోకి రావొచ్చ‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుందో చూడాలి.