Begin typing your search above and press return to search.

ఏర్పాటు చేశాను నువ్వు కలెక్టర్‌ అవుతావు : సోనూసూద్‌

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:20 PM IST
ఏర్పాటు చేశాను నువ్వు కలెక్టర్‌ అవుతావు : సోనూసూద్‌
X
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తు రియల్‌ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒక విద్యార్థి తనకు వచ్చిన మార్కులను అటాచ్‌ చేసి నేను క్లాస్‌ లో టాపర్‌. కాని నాకు చదువుకునేంత ఆర్థిక స్థోమత లేదు తన చదువు కోసం సాయం చేయాలంటూ సోనూ సూద్‌ కు విజ్ఞప్తి చేశాడు. షేక్‌ కరిముల్లా చేసిన విజ్ఞప్తికి వెంటనే సోనూసూద్‌ స్పందించాడు. ఆయన కోసం సరత్‌ ఐఏఎస్‌ అకాడమీతో మాట్లాడి వెంటనే కరిముల్లా కు సీటు ఇప్పించడంతో పాటు అందుకు సంబంధించిన అన్ని ఆర్థిక వనరులు సమకూర్చాడు.

కరిముల్లా ట్వీట్‌ కు సమాధానంగా సోనూసూద్‌.. నువ్వు కలెక్టర్‌ అవుతావు.. నీ కోసం ఏర్పాటు చేశాను. ఇందుకు సహకరించిన ఐఏఎస్‌ సరత్‌ అకాడమీతో మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. కరిముల్లా కు వారు సాయం చేసేందుకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ సోనూ సూద్‌ ట్వీట్‌ చేశాడు. మొత్తానికి తనకు చేతనైన సాయం చేస్తూ ఎంతో మందికి రియల్‌ హీరోగా నిలుస్తున్నాడు.

నువ్వు కలెక్టర్‌ అవుతావు.. అందుకు నేను ఏర్పాట్లు చేశాను అంటూ సోనూ సూద్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమా అల్లుడు అదుర్స్‌ షూటింగ్‌ లో నటిస్తున్నాడు. బాలయ్య మరియు చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా సోనూసూద్‌ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.