Begin typing your search above and press return to search.

సోనూ సూద్ మరోసాయం.. ఈసారి అడగ్గానే ఉద్యోగం

By:  Tupaki Desk   |   28 July 2020 12:30 PM GMT
సోనూ సూద్ మరోసాయం.. ఈసారి అడగ్గానే ఉద్యోగం
X
సోనూ సూద్.. సోనూ సూద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారు మ్రోగేలా ఈ బాలీవుడ్ నటుడి నామ జపమే వినిపిస్తోంది. వేల కోట్లు ఉన్న వారు కూడా చేయలేని పనులను ఈ కరోనా టైంలో ఉదారంగా.. నిస్వార్థంగా సేవ చేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఈ నటుడు.

కరోనాతో ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకుంటున్నారు. తను సంపాదించిందే తక్కువ అయినా ఉన్నంతలో సాయం చేస్తూ అలుపెరగకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు.

తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ టెక్కీ శారదకు ఓ పెద్ద సాయం చేశాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న శారద గురించి సోన్ సూద్ కు ఒకరు ట్వీట్ చేయగా.. సోమవారం ఆమెకు ఓ జాబ్ ఆఫర్ లెటర్ ను సోనూ సూద్ అందించాడు.

శారద కరోనా లాక్ డౌన్ వేళ ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబం పూట గడవకపోవడంతో కూరగాయలు విక్రయిస్తూ పొట్టపోసుకుంది. స్వయంగా కూరగాయలు అమ్ముతున్న శారద దుస్థితిపై ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ను సాయం చేయాలని అభ్యర్థించాడు.

వెంటనే స్పందించిన సోనూ సూద్ తన అధికారి ఆమెను కలిశారని.. ఆమెకు ఉద్యోగ నియామక లేఖ కూడా అందిందని ఆయన ట్వీట్ చేశారు. ఇదే అంశంపై టెక్కీ శారద స్పందించారు. సోనూ సూద్ నుంచి తనకు సహాయం అందిందని ఆమె సోనూ సూద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఉద్యోగం కోల్పోయిన శారదను కూడా ఆదుకొని సోనూ సూద్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.