Begin typing your search above and press return to search.

ఏపీలో ఫస్ట్ ఆక్సిజన్ ప్లాంట్లు పెడుతున్న సోనూ సూద్

By:  Tupaki Desk   |   22 May 2021 3:30 PM GMT
ఏపీలో ఫస్ట్ ఆక్సిజన్ ప్లాంట్లు పెడుతున్న సోనూ సూద్
X
ఏపీపై ప్రముఖ నటుడు సోనూ సూద్ ప్రేమ కనబరిచాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకొని దేశవ్యాప్తంగా రియల్ హీరోగా సోనూ సూద్ మారాడు. ఇప్పటికే తన సేవలు కొనసాగిస్తూ దేశ ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు సోనూ సూద్ అంటే సేవకు పరమార్థంగా మారాడు. కోవిడ్19పై అతడు సాగిస్తున్న పోరాటం ప్రశంసలు అందుకుంటోంది.

కరోనాతో ఆక్సిజన్ అందక దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టేందుకు సోనూ సూద్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ నుంచి ఈ ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు శ్రీకారం చుట్టాడు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నాడు.

సోనూ సూద్ ఏపీపై ప్రేమ చూపాడు. దేశంలోని మొదటి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏపీలోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశాడు. సోనూసూద్ మరియు అతడి బృందం ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది. తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర అధికారుల నుంచి ఇందుకు సంబంధించిన అనుమతులు పొందారు.

కర్నూలు, నెల్లూరులో ఎక్కువ కేసులు ఆక్సిజన్ సంబంధించిన రావడం.. ఆక్సిజన్ అందకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడ్డట్టు గుర్తించి ఈ ఆక్సిజన్ ప్లాంట్లను సోనూ సూద్ ఏర్పాటు చేస్తున్నాడు. దీనివల్ల వేలాది మంది రోగుల ప్రాణాలు కాపాడినవారు అవుతున్నారు.

సోనూ సూద్ పై కర్నూలు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సోనూసూద్ మానవత్వ ఆలోచనలకు మేం నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తో ప్రతిరోజు కర్నూలు ప్రభుత్వం ఆస్పత్రిలో 200 మంది కోవిడ్ రోగులకు చికిత్స చేయడంలో సహాయపడుతోందని ప్రశంసించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ఆక్సిజన్ ప్లాంట్లను తొలుత ఏపీలో ఏర్పాటు చేసి సహాయ పడుతున్నామని సోనూ సూద్ తెలిపారు. ఏపీ తరువాత, జూన్, జులైలో మరికొన్ని రాష్ట్రాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వివిధ రాష్ట్రాల్లోని నిరుపేద ఆస్పత్రులను గుర్తిస్తున్నామని సోనూ సూద్ తెలిపారు.